Space Tour Tickets : అన్ని రంగాల్లోనూ అమెరికాకు ధీటుగా చైనా దూసుకుపోతోంది. చివరకు స్పేస్ టూరిజంలోనూ అమెరికాకు పోటీ ఇచ్చేందుకు డ్రాగన్ రెడీ అవుతోంది. ఈ దిశగా చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘డీప్ బ్లూ ఏరోస్పేస్’ రంగం సిద్ధం చేస్తోంది. 2027లో తమ కంపెనీ నిర్వహించనున్న స్పేస్ టూర్ ప్రాజెక్టు కోసం ఇప్పటి నుంచే టికెట్లను అమ్ముతోంది. ఈ రోజు (అక్టోబరు 24) సాయంత్రం 6 గంటల నుంచి ఈ టికెట్ల సేల్ ప్రక్రియ మొదలుకాబోతోంది. ఇంతకీ ఎన్ని టికెట్లు ఉన్నాయి ? వాటి రేటు ఎంత ?
Also Read :Cycle Symbol : ‘ఇండియా’ అభ్యర్థులంతా ‘సైకిల్’ గుర్తుపైనే పోటీ చేస్తారు : అఖిలేష్
- డీప్ బ్లూ ఏరోస్పేస్ కంపెనీ 2027లో అంతరిక్ష యాత్ర కోసం ఒక రాకెట్‌ను పంపనుంది.
- ఈ రాకెట్‌లో టూరిస్టుల కోసం కేవలం రెండు సీట్లు మాత్రమే ఉంటాయి.
- ఈ రెండు టికెట్ల కోసమే ఈ రోజు సాయంత్రం నుంచి ఔత్సాహికులు పోటీపడనున్నారు.
- చైనాలోని(Space Tour Tickets) కుబేరుల కుటుంబాలకు చెందిన ఔత్సాహికులు ఈ టికెట్లను కొనే అవకాశం ఉంది.
- అంతరిక్ష యాత్ర అంటే ఆషామాషీ విషయం కాదు. అల్లంత ఎత్తు నుంచి యావత్ భూమిని చూసే ఛాన్స్ దక్కుతుంది.
- అందుకే ఈ స్పేస్ టూర్‌కు సంబంధించిన టికెట్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఒక టికెట్ రేటు కేవలం రూ.1.77 కోట్లు మాత్రమే అని డీప్ బ్లూ ఏరోస్పేస్ కంపెనీ వెల్లడించింది.
- ఈ టికెట్లు బుక్ చేసుకునే వారిని 2027 సంవత్సరంలో సబ్ ఆర్బిటల్ ఫ్లైట్‌లో స్పేస్ టూర్‌కు తీసుకెళ్తామని కంపెనీ పేర్కొంది. అంటే టూరిస్టులతో కూడిన రాకెట్ అంతరిక్షం దాకా జర్నీ చేస్తుందన్న మాట.
- నవంబరు నెల నుంచి మరిన్ని స్పేస్ టూర్ ట్రిప్పుల కోసం అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ తీసుకుంటామని డీప్ బ్లూ ఏరోస్పేస్ తెలిపింది.
- 2028 నుంచి చైనాలో స్పేస్ టూరిజం కోసం ప్రత్యేక విమానాలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.