Wife & Husband Kiss: భార్యకు ముద్దు పెట్టాడు.. నాలుక తెంపుకొని హాస్పటల్ పాలయ్యాడు

తాజాగా ఓ ముద్దు వార్త మాత్రం ఇలా కూడా చేస్తారా..? అని మాట్లాడుకునేలా చేసింది. బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన భర్త నాలుకను కొరికేసిందో ఇల్లాలు (Wife).

Published By: HashtagU Telugu Desk
Kissing Day 2024

Kissing Day 2024

ముద్దు (Kiss) అనేది ఒక విధమైన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే వివిధ సంస్కృతులలో అనురాగం, గౌరవం, స్వాగతం, వీడ్కోలు మొదలైన ఇతర భావాలతో కూడా ముద్దు పెట్టుకుంటారు. అందుకే ముద్దు (Kiss) లేనిదే జీవితం వ్యర్థమని ముద్దుని వర్ణిస్తూ ఎంతోమంది రచయితలు ఎన్నో పాటలు రాస్తూ ఉంటారు. అంతటి ప్రాధాన్యమున్న ముద్దుకు సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా ఓ ముద్దు వార్త మాత్రం ఇలా కూడా చేస్తారా..? అని మాట్లాడుకునేలా చేసింది. బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన భర్త నాలుకను కొరికేసిందో ఇల్లాలు (Wife). ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ కర్నూల్‌ (Karnool) జిల్లాలో చోటు చేసుకున్నది.

కర్నూలుకు చెందిన తారాచంద్ నాయక్.. అదే జిల్లాలోని తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాకు చెందిన పుష్పావతిని 2015లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా గడిచిన వీరి దాంపత్యంలో గత రెండేళ్లుగా గొడవలు నడుస్తున్నాయి. ఇటీవల మరింత ఎక్కువయ్యాయి. శుక్రవారం ఉదయం కూడా వీరి మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది. దీంతో తారాచంద్ భార్యపై దాడిచేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి భార్య (Wife) వద్దకు వెళ్లి ముద్దుపెట్టాడు. అప్పటికే భర్తపై తీవ్ర కోపంతో ఉన్న పుష్పావతి నాలుక కొరకడంతో తెగిపడింది. తీవ్ర రక్తస్రావంతో తారాచంద్ హాస్పటల్ కు పరుగులు పెట్టాడు.

ఇష్టం లేకుండా ముద్దు (Kiss) పెట్టినందుకే తాను నాలుక కొరికినట్టు భార్య తెలిపింది. బలవంతంగా ప్రయత్నిస్తే వద్దని చెప్పానని.. అయినా వినకుండా ముద్దుపెట్టడం వల్లే ఆ పనిచేసినట్టు చెప్పుకొచ్చింది. అయితే తన భార్యకు వేరొకరితో అఫైర్ ఉందని.. అందుకే తనను దూరం పెడుతోందని తారాచంద్ చెబుతున్నాడు. నాకు నా పిల్లలకు ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నాడు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: Monsoon Pregnancy: గర్భిణులు బీ అలర్ట్.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

  Last Updated: 22 Jul 2023, 02:35 PM IST