Weekly Horoscope : ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 2 వరకు వారఫలాలు.. వారిపై ఒత్తిడి ఎక్కువ

Weekly Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం (ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 2 వరకు) రాశి ఫలితాలు ఇవీ..  

  • Written By:
  • Updated On - August 27, 2023 / 08:55 AM IST

Weekly Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం (ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 2 వరకు) రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈవారం మేషరాశి వారు అనవసర విషయాల్లో తలదూర్చరాదు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, గౌరవప్రదంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికి మీరు విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. గురు, శుక్ర, బుధ గ్రహాల అనుకూలత వల్ల కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి.బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆది, మంగళ, శనివారాల్లో రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి.

వృషభ రాశి

ఈవారం వృషభ రాశి వారు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. తెలివిగా ప్రవర్తిస్తే మంచిది. మొహమాటం కారణంగా శ్రమ పెరుగుతుంది. మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయి. వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది.  రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారం దుర్గాదేవిని పూజించాలి.

మిథునం

ఈవారం మిథునరాశి వారికి వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ, అత్యవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు.  తొందరపడి మాట్లాడితే ఇతరులు అపార్ధం చేసుకోనే ప్రమాదం ఉన్నది. రుణ సమస్యలు ఎదురవుతాయి. మిత్రుల సాయంతో ఆర్థిక నష్టాన్ని నివారిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

Also read: INDIA – Social Media : సోషల్ మీడియా అస్త్రంపై ‘ఇండియా’ కసరత్తు.. త్వరలో కూటమికి కొత్త లోగో

కర్కాటకం

ఈవారం కర్కాటక రాశి వారికి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా నష్టం రాకుండా చూసుకోవాలి.  ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ఆచితూచి వ్యవహరించాలి. ధైర్యంతో ముందుకు సాగండి. కొన్ని వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించుకోవడానికి, ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించండి.

సింహం

ఈవారం సింహరాశి వారికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి.  మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది.ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్య (Weekly Horoscope)

ఈవారం కన్యారాశి వారు వివాదాలకు దూరంగా ఉండండి. తోబుట్టువులతో ఆస్తి వివాదం గురించి సంప్రదిస్తారు. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఆపదలను అధిగమిస్తారు. ప్రధాన వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించడం కంటే అందరినీ కలుపుకుని పోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, మీ చేతకు తిరుగుండదు. మహావిష్ణువును పూజించాలి.

Also read: Garlic Side Effects: వెల్లుల్లి అధికంగా వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

తుల

ఈవారం తులారాశి వారు సొంత వాహనంలో ప్రయాణం చేయకపోవడం శ్రేయస్కరం. కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. కష్టపడి విజయం సాధిస్తారు.  మానసిక ఒత్తిడి తగ్గుతుంది.  వారాంతంలో శుభయోగం ఉన్నది. అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

వృశ్చికం

ఈవారం వృశ్చిక రాశివారికి బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. ఇబ్బందులకు గురిచేసేవారున్నారు జాగ్రత్త వహించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. బంధువుల నుంచి ఊహించని విధంగా శుభవార్త వినడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. రుణ విమోచక అంగారక స్తోత్రం చదవండి.

ఈవారం ధనుస్సు రాశి వారి ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వాహనాలతో అప్రమత్తంగా ఉండాలి. వృథా ప్రయాణాలుంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. భూలాభము ఉన్నది. తల్లితండ్రుల కారణంగా ఆర్థిక పురోగతి లభిస్తుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించండి. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈవారం మకర రాశి వారు ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలకు దూరంగా ఉండండి. వ్యతిరేకంగా మాట్లాడేవారికి దూరంగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలను పరిష్కరించుకోవడంలో నిర్లక్ష్యం, అశ్రద్ధలను పక్కన పెట్టడం జరుగుతుంది. వ్యయభారం విషయంలో జాగ్రత్తపడాలి. పట్టుదల అవసరం. శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభం

ఈవారం కుంభ రాశి వారు ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. ఉద్యోగపరంగా దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. శ్రమ అవసరం. శక్తి వంచన లేకుండా పనిచేస్తే సత్ఫలితాలిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలన్నీ పూర్త వుతాయి. ఆస్తి వృద్ధి అవుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మీనం 

ఈవారం మీన రాశి వారు వాహనాలను స్పీడ్‌గా నడపకపోవడం మంచిది. మనసు పెట్టి పనిచేయండి. కొన్ని పొరపాట్లు జరిగే ఆస్కారం లేకపోలేదు. ధైర్యం, ఏకాగ్రత రెండూ ముఖ్యమే. ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు. అధికారుల వద్ద కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే అంతా శుభమే జరుగుతుంది.  ప్రయత్నలోపం ఉండని పక్షంలో కార్య సిద్ధికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల్ని కలుపుకుని వెళ్లడం మంచిది. నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.