పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు (Parliament Elections 2024) అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి..తెలంగాణ (Telangana) విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించి తన ఉనికిని పెంచుకున్న బిజెపి (BJP)..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఈ మేరకు బిజెపి అగ్ర నేత, కేంద్రమంత్రి అమిత్ షా (Amith Shaa)..శుక్రవారం హైదరాబాద్ లో తెలంగాణ బిజెపి నేతల తో సమావేశమై..పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేసారు. ఇదే క్రమంలో పలువురు నేతలు తమ టికెట్స్ ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ వెంకంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఏలేటి సురేష్ రెడ్డి (Yeleti Suresh Reddy) జహిరబాద్ పార్లమెంటు (Zahirabad Lok Sabha) బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తాను వస్తున్నట్లు సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలవడం జరిగింది. తనకు ఎంపీ టికెట్ ఖరారు చేయాలనీ కోరగా..ఆయన సానుకూలంగా స్పందించారు.
ఏలేటి సురేష్ రెడ్డి (Yeleti Suresh Reddy) విషయానికి వస్తే..చిన్నప్పటి నుండి చాల కష్టాలను అనుభవించి.. నిరాడంబరమైన జీవితం గడుపుతూ వచ్చాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సురేష్..ఈరోజు గొప్ప బిజినెస్ మ్యాన్ గా..ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. తన పుట్టి పెరిగిన గ్రామంలో కావాల్సిన సదుపాయాలు లేనప్పటికీ..తన ఆశయాలతో ముందుకు సాగారు. తాండూరులో హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత..తన జీవిత అడుగులు మొదలుపెట్టారు. హైదరాబాద్‌కు కు వచ్చిన ఆయన.. మెడికల్ స్టోర్ సేల్స్‌బాయ్ గా చేరి కేవలం వంద రూపాయల జీతం తో తన జీవనం సాగించారు. కష్టాలు , అవమానాలు ఇలా ఎన్నో భరిస్తూ..ఉన్నత ఆస్థాయికి ఎదగాలనే ఆశయంతో ఎక్కడ వెనక్కు తగ్గకుండా తన ప్రయాణాన్ని సాగించారు.
We’re now on WhatsApp. Click to Join.
1999లో వ్యవస్థాపక రంగంలో అడుగుపెట్టి.. సెల్యులార్ నెట్‌వర్క్ ఫ్రాంచైజీని ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతి అడుగు విజయం వైపు వేస్తూ..తన నైపుణ్యంతో అందరికి సహాయపడుతూ ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఇంటీరియర్ డిజైన్‌కు 2010లో ప్రశంసలు అందుకోవడంతో ఈ రంగంలో ఆయన ప్రతిభను గుర్తించారు. ఆ తర్వాత పలు వ్యాపారాలు మొదలుపెట్టి వందలాది మందికి ఉపాధికల్పించారు. ఆ తర్వాత 6 టీవీ న్యూస్ ఛానల్ ప్రారంభించి ప్రజల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చాడు..కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, వ్యాపారం మరియు యువత సాధికారతపై దృష్టి సారించి సామాన్యుల ఆందోళనలను బయటకు తీసుకరావడం చేసారు. తాను ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్న తన స్వగ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించడం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో అంకితభావాన్ని చూపిస్తుంటారు. ఇప్పటి వరకు తన వ్యాపారాలతో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ వచ్చిన ఆయన..ఇక ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనీ చూస్తున్నారు. అందుకే జహిరబాద్ పార్లమెంటు బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనీ భావిస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లో అడుగుపెడితే..ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అక్కడి వారు చెపుతున్నారు.
Read Also : Deer Hunting: తెలంగాణలో జింకల వేట.. పోలీసులకు చిక్కిన వేటగాళ్లు
