Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక్కించుకున్నాడు. మేడిపల్లి ప్రాంతానికి చేరుకున్న తర్వాత నిందితుడు అకస్మాత్తుగా తనకు కాలు నొప్పిగా ఉందని […]

Published By: HashtagU Telugu Desk
Cab

Cab

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక్కించుకున్నాడు. మేడిపల్లి ప్రాంతానికి చేరుకున్న తర్వాత నిందితుడు అకస్మాత్తుగా తనకు కాలు నొప్పిగా ఉందని చెప్పి, వాహనాన్ని రోడ్డుపక్కన ఆపాలని కోరాడు. అనంతరం తనకు సిగరెట్ కొనివ్వాలని డ్రైవర్‌ను పంపించాడు. ప్రయాణికుడి మాటలు నమ్మిన భాను ప్రభు సమీపంలోని దుకాణానికి వెళ్లి సిగరెట్ కొనుగోలు చేసి తిరిగి వచ్చేసరికి.. నిందితుడు క్యాబ్‌తో సహా అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించాడు. వెంటనే అతడిని వెంబడించినప్పటికీ పట్టుకోలేకపోయాడు. దీంతో బాధితుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థల పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

  Last Updated: 22 Jun 2026, 12:35 PM IST