July Rainfall : ఈనెలలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు వర్షపాత సూచనపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలకమైన అంచనాలను వెలువరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి విస్తరణ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో చల్లని వాతావరణం కనిపిస్తోందని పేర్కొంది. రేపటి నుంచి మొదలుకానున్న ఈనెల రెండోవారంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అరేబియా మహాసముద్రంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈసారి జులై నెలలో తెలంగాణలో సాధారణం కంటే అధిక మోతాదులో వర్షాలు(July Rainfall) కురుస్తాయనే గుడ్ న్యూస్‌ను ఐఎండీ వినిపించింది.
We’re now on WhatsApp. Click to Join
జూన్ నెలలో..
ఇక గత నెలలో (జూన్) తెలంగాణలో మోస్తరు వర్షాలే కురిశాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ నెలలో 131.4 మి.మీ వర్షపాతం కురుస్తుంటుంది. ఈసారి దాని కంటే 17 శాతం ఎక్కువ వానలు (153.5 మి.మీ) పడ్డాయి. గతనెలలో మూడో వారం వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గలేదు. గత నెలలో తెలంగాణలోని(Telangana) 6 జిల్లాల్లో ఉన్న 143 మండలాలు వర్షపాత లోటును ఎదుర్కొన్నాయి. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలు , నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలు, వికారాబాద్ జిల్లాలోని 19 మండలాలు, కామారెడ్డి జిల్లాలోని 23 మండలాలు వర్షపాత లోటును ఎదుర్కొన్నాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న 138 మండలాల్లో సాధారణ స్థాయిలో వానలు పడ్డాయి. కానీ మరో ఆరు జిల్లాల పరిధిలోని 147 మండలాల్లో మాత్రమే సాధారణం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయి. ఇంకో 13 జిల్లాలలోని మండలాల్లో సాధారణం కంటే 20 నుంచి 59 శాతం ఎక్కువ వానలు పడ్డాయి.
Also Read :Ola Maps: గూగుల్ మ్యాప్స్‌కు గుడ్ బై చెప్పిన ఓలా.. ఇకపై ఓలా మ్యాప్స్‌పైనే రైడింగ్..!
కావూరిహిల్స్‌లో అత్యధికంగా..
హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో అత్యధికంగా 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం, బోరబండలో 6.5, ఎంసీహెచ్‌ఆర్‌డీలో 6.3, ఫతేనగర్‌లో 5.5, బాలానగర్, యూసు్‌ఫగూడలో 5.3, మూసాపేటలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ట్యాంక్‌బండ్, టోలిచౌకీ, మెహిదీపట్నం, జేఎన్‌టీయూ ఏరియాల్లో ట్రాఫిక్ జాం అయింది.