Site icon HashtagU Telugu

Trump Tower Hyderabad : త్వరలో హైదరాబాద్‌కు ట్రంప్ కుమారులు.. కారణం ఇదే

Trump Tower Hyderabad Us President Donald Trumps Sons In India

Trump Tower Hyderabad : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు. దీంతో ఆయన కుటుంబం మళ్లీ యాక్టివేట్ అయింది. అమెరికా అంటేనే అగ్రరాజ్యం. ప్రపంచ దేశాలపై దానికి ఎంతో కొంత పట్టు ఉండబట్టే అగ్రరాజ్యం అనే పేరు వచ్చింది. అందుకే డొనాల్డ్ ట్రంప్ కుమారులు రంగంలోకి దూకారు. తమ వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంపై ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే వారు త్వరలోనే మన హైదరాబాద్‌కు కూడా వస్తారని తెలిసింది. ట్రంప్ టవర్స్‌ను హైదరాబాద్‌లో కూడా నిర్మించాలనే ప్లాన్‌తో వాళ్లు ఉన్నారట. ఇందుకోసం మన భాగ్యనగరంలోని లగ్జరీ, కాస్ట్లీ లొకేషన్‌లో స్థలాన్ని కొనబోతున్నారట. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన  ట్రంప్ టవర్స్ అనేది లగ్జరీ అపార్ట్‌మెంట్లను, హోటళ్లను నిర్మిస్తుంటుంది.  మనదేశంలోని ముంబై, పూణె, కోల్‌కతా, గుర్గావ్‌లలో ఇప్పటికే 4 ట్రంప్ టవర్లు ఉన్నాయి. 2030 నాటికి భారత్‌లో ట్రంప్ టవర్ల సంఖ్యను 10కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్,  ముంబై, గుర్గావ్, పూణె, నోయిడా, బెంగళూరులలో కొత్త ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. ఈ నూతన నిర్మాణ ప్రాజెక్టుల పనులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు త్వరలో స్వయంగా ప్రారంభిస్తారట.

Also Read :Megha : మేఘా, స్కైరూట్‌, యూనీలీవర్.. తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులు ఇవీ

హైదరాబాద్‌ను ఎందుకు ఎంచుకున్నారు ?

హైదరాబాద్‌(Trump Tower Hyderabad) మహా నగరంపై ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రముఖ కంపెనీల ఫోకస్ ఉంది. ఈక్రమంలోనే ట్రంప్ టవర్స్ కూడా ఇక్కడ తమ టవర్‌ను నిర్మించబోతోంది. ఇందుకోసం భారీగా నిధులను వెచ్చించబోతోంది. లగ్జరీ హోటళ్లు, అపార్ట్‌మెంట్లకు హైదరాబాద్‌లో రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇదంతా తెలుసుకున్నాకే.. హైదరాబాద్‌లోనూ ట్రంప్ టవర్ ఏర్పాటు దిశగా డొనాల్డ్ ట్రంప్ కుమారులు నిర్ణయం తీసుకున్నారట. గూగుల్, ఫేస్‌బుక్ నుంచి మొదలుకొని ఎన్నో ప్రముఖ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇతరత్రా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగింది. ఈ పరిణామాలు తమ వ్యాపారానికి కూడా కలిసొస్తాయనే ఆశాభావంతో ట్రంప్ కుమారులు ఉన్నారు. తాము నిర్మించే లగ్జరీ నివాసాలు ఈజీగా సేల్ అవుతాయనే అంచనాలతో వారు ఉన్నారు.

Also Read :Congress Schemes: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు -భట్టి విక్రమార్క

ట్రంప్ టవర్లలో ఇళ్ల రేట్లు ఇలా..