హైదరాబాద్ ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానాకు చెందిన అంజలి అనే విద్యార్ధిని ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుతోంది. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: 5 Killed : జమ్ము కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి