తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారాకరామారావు జయంతి సందర్భంగా పలువురు నివాళ్లు అర్పించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున అమీర్ పేట మైత్రీవనం జంక్షన్‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పీఎం రేవంత్‌తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, అరికపూడి గాంధీ, కమ్మ కార్పోరేషన్ చైర్మన్ బండి రమేష్ ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.జూబ్లీహిల్స్ ప్రజలు తమ అభిమాన నాయకుడు, దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరగా, తాను స్వయంగా వచ్చి విగ్రహావిష్కరణ చేస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, ప్రజల అభిమానం, నాయకుల సేవల గుర్తింపుగా ఇలాంటి కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటని కొందరు మాట్లాడుకుంటున్నారని.. విమర్శలు చేస్తున్నారన్నారు. కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ పేరు, ఆయన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి
NTR : అమీర్ పేటలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారాకరామారావు జయంతి సందర్భంగా పలువురు నివాళ్లు అర్పించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున అమీర్ పేట మైత్రీవనం జంక్షన్‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పీఎం రేవంత్‌తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, అరికపూడి గాంధీ, కమ్మ కార్పోరేషన్ చైర్మన్ బండి రమేష్ ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో […]

NTR
Last Updated: 28 May 2026, 10:15 PM IST