తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నారు. మొత్తం 24 లక్షల మంది వర్చువల్‌గా భాగస్వామ్యం అవ్వటం ఈ మహానాడు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మహానాడు వేదికగా 21 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీటిలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు అమలు చేస్తామని ప్రకటన చేసారు. ముసాయిదా తీర్మానాల పుస్తకంలో తెలుగుదేశం పార్టీ చరిత్ర, కార్యకర్తల పోరాటం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరంగా పొందుపరచారు.
ఈ మహానాడులో 88 మంది కార్యకర్తలు, నాయకులు వివిధ తీర్మానాలపై ప్రసంగించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టి, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం ఎలా అడుగులు వేస్తోందో వివరించారు. గొడ్డలి పార్టీ (వైసీపీ) అబద్ధాలు, అక్రమాలను బయటపెట్టారు. ఈ విజయం కేవలం మహానాడుతో ఆగకూడదని, ముసాయిదా తీర్మానాల్లోని ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. బడుగు, బలహీన వర్గాలకు ప్రజా ప్రభుత్వం ఏమి చేస్తోందో వివరించాలని, అభివృద్ధిని అడ్డుకునే గొడ్డలి పార్టీ కుట్రలను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతలుగా ఉంటారని, కార్యకర్తలే పార్టీ ఊపిరని, వారి సంక్షేమం తన బాధ్యత అని పార్టీ అధినేత స్పష్టం చేశారు. జెన్ జీ యువతకు గత ఐదేళ్లలో జగన్ పాలన రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసిందో తెలియజేయాలని, మళ్లీ అలాంటి విధ్వంసం జరగకుండా చైతన్యం కల్పించాలని నిర్ణయించింది.
