Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సంచలనం.. టీజీఐఐసీ వేలంలో భారీ బిడ్డింగ్

తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూముల ఇ-వేలంలో రికార్డు స్థాయి ధర నమోదైంది. ఈ – వేలంలో రాయ‌దుర్గం ప్రధాన భూమి ఎకరాకు సుమారు రూ.237 కోట్ల ధర పలికి కొత్త రికార్డు సృష్టించింది. 6.29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నంబర్ 1A, 1/Fలకు ఈ భారీ ధర లభించింది. ఎకరాకు రూ.139 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా, దానికంటే 70 శాతం అధికంగా బిడ్డింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం లావాదేవీ […]

Published By: HashtagU Telugu Desk
RAIDURG

RAIDURG

తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూముల ఇ-వేలంలో రికార్డు స్థాయి ధర నమోదైంది. ఈ – వేలంలో రాయ‌దుర్గం ప్రధాన భూమి ఎకరాకు సుమారు రూ.237 కోట్ల ధర పలికి కొత్త రికార్డు సృష్టించింది. 6.29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నంబర్ 1A, 1/Fలకు ఈ భారీ ధర లభించింది. ఎకరాకు రూ.139 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా, దానికంటే 70 శాతం అధికంగా బిడ్డింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం లావాదేవీ విలువ దాదాపు రూ.1,490.73 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఈ వేలంలో ప్రముఖ జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ డెవలపర్లు పోటీగా బిడ్లు వేసినట్లు సమాచారం. MSTC ఇ-వేలం పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించింది.

టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. ఈ వేలానికి వచ్చిన స్పందన హైదరాబాద్ తెలంగాణపై పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా ఈ విజయం మరింత బలోపేతం చేసిందని అన్నారు. ఇది గతంలో నమోదైన టీజీఐఐసీ రికార్డును కూడా అధిగమించింది. 2025లో జరిగిన గత వేలంలో ఎకరాకు రూ.177 కోట్ల ధర నమోదైంది.

  Last Updated: 28 May 2026, 08:58 PM IST