Revanth in Chandrababu’s Trap : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి – అరికెపూడి గాంధీల (Kaushik Reddy Vs Arekapudi Gandhi) సవాళ్లతో తెలంగాణాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బిఆర్ఎస్ (BRS)నుండి గెలిచి కాంగ్రెస్ (Congress) లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చీరలు , గాజులు పంపిస్తున్న..ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బిఆర్ఎస్ జెండా ఎగురువేస్తా అని కౌశిక్ సవాల్ విసరడం..నెస్ట్ డే గాంధీ తన అనుచరులతో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం ..ఆ తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ ఫై పిర్యాదు చేసేందుకు వెళ్తే వారిని అరెస్ట్ చేయడం..ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతుంది. ఇక శుక్రవారం మధ్యాహ్నం శంభీపూర్ రాజుతో కలిసి కౌశిక్ (Kaushik Reddy Press Meet) ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.
కేసీఆర్ (KCR) దయ వల్లే రేవంత్ (Revanth) కు సీఎం పదవి
‘రేవంత్‌రెడ్డి చీటికిమాటికి కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీశ్‌రావును దూషిస్తున్నరు. వాస్తవానికి కేసీఆర్ లేకుంటే ఈరోజు రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవాడా..? అసలు సీఎం కుర్చీ ఉండేదా..? నీకు సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షే కదా..? ఎందుకు మరి ఎగిరెగిరి పడుతున్నరు. ఇగనన్నా మీ అవాకులు, చెవాకులు బంద్ చేయండి’ అంటూ సీఎం రేవంత్ ఫై కౌశిక్ కీలక వ్యాఖ్యలు చేసారు. మా ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేసి కల్వకుర్తికి తీసుకుపోయారు ..? హరీశ్‌రావు చేసిన తప్పేంది..? మీరు ఎందుకు ఈ వెకిలి చేష్టలు చేస్తుండ్రు..? మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు ఈ అరాచకాలు చేస్తరు..? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
నేను ఆంధ్రాసెటిలర్‌లను (Andhra Settlers) అనలేదు
కాంగ్రెస్ నా వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం చేస్తుందని.. నేను ఆంధ్రావాళ్లను తిట్టిన అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి నేను ఆంధ్రాసెటిలర్‌లను అనలేదు. ఇది మా ఇద్దరి వ్యక్తిగత విషయం. నేను వ్యక్తిగతంగా అరికపూడి గాంధీని అన్న. ఆంధ్రా సెటిలర్‌ల కాలికి ముళ్లు గుచ్చుకుంటే తాను పంటితో తీస్తా అని మా నాయకుడు కేసీఆర్ స్వయంగా అన్నారు. వీళ్ల చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని’ కౌశిక్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని ..ఇక్కడి పెట్టుబడులన్నీ అమరావతికి తరలిపోతున్నాయని కౌశిక్ ఆరోపించారు.
హైడ్రా (Hydra) తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ (Hyderabad Brand Image Damage)
ఇప్పటికే హైడ్రా పేరుతో ప్రభుత్వం రోజుకో బిల్డింగ్‌ను కూలగొడుతోందని, హైదరాబాద్‌లో నివసించే సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని కౌశిక్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటే చాలామంది భయపడుతున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోన్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతోందని, హైదరాబాద్ అభివృద్ధిని ఉద్దేశపూరకంగానే అడ్డుకుంటోందని పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.