Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

హైదరాబాద్ లో వంద‌ల కోట్ల భూమిని క‌బ్జా భాగోతం బ‌య‌ట‌ప‌డింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల […]

Published By: HashtagU Telugu Desk
LAND SCAM

LAND SCAM

హైదరాబాద్ లో వంద‌ల కోట్ల భూమిని క‌బ్జా భాగోతం బ‌య‌ట‌ప‌డింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీపేట గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, నిమ్మల రాజేష్ తదితరులు ప్రభుత్వ భూమిని అక్రమంగా తమ పేర్లకు కేటాయించినట్లు చూపిస్తూ నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించారు. దర్యాప్తులో భాగంగా నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు బ్యాంకు పాస్‌బుక్‌లు, అవగాహన ఒప్పందాలు (MOUలు), మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, సునీల్, రాధాకృష్ణలతో కలిసి సర్వే నంబర్ 18లోని 10 ఎకరాల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించి తమకు కేటాయించినట్లు నకిలీ పత్రాలు రూపొందించారు. అనంతరం ఆ భూమిని ఎకరాకు రూ.3.5 కోట్ల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ భూ లావాదేవీలకు సంబంధించి నిమ్మల కుటుంబ సభ్యులు దాదాపు రూ.4 కోట్లు స్వీకరించినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

  Last Updated: 29 May 2026, 11:16 PM IST