Gaddar : “అన్న నువ్వు గాయపడ్డ పాటవి. కానీ ప్రజల గాయానికి కట్టుబడ్డ పాటవి’ – పవన్

ప్రజా గాయకుడు గద్దర్ జయంతి (Gaddar Birthday) ఈరోజు..ఈ సందర్బంగా ఆయన అభిమానులు, కళాకారులంతా గద్దర్ కు నివాళ్లు అర్పిస్తూ..గద్దర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గద్దర్ కోసం ప్రత్యేక వీడియో ను షేర్ చేసి ఆకట్టుకున్నారు. గద్దర్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత అభిమానమో చెప్పాల్సిన పనిలేదు. గద్దర్ కు సైతం పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం..ఇద్దరు అప్పుడప్పుడు […]

Published By: HashtagU Telugu Desk
Gaddar Pawan

Gaddar Pawan

ప్రజా గాయకుడు గద్దర్ జయంతి (Gaddar Birthday) ఈరోజు..ఈ సందర్బంగా ఆయన అభిమానులు, కళాకారులంతా గద్దర్ కు నివాళ్లు అర్పిస్తూ..గద్దర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గద్దర్ కోసం ప్రత్యేక వీడియో ను షేర్ చేసి ఆకట్టుకున్నారు. గద్దర్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత అభిమానమో చెప్పాల్సిన పనిలేదు. గద్దర్ కు సైతం పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం..ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే గద్దర్ చివరి రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ హాస్పటల్ కు వెళ్లి గద్దర్ ను పరామర్శించడం జరిగింది. ఇలా గద్దర్ అంటే ఎంతో అభిమానం..ప్రేమ ఉన్న పవన్..ఈరోజు ఆయన జయంతి సందర్బంగా నివాళులర్పిస్తూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘అన్నా.. నువ్వు గాయపడ్డ పాటవి. కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవి.. అన్యాయంపై తిరగబడ్డ పాటవి. ఇదివరకు ధ్వనించే పాటవి. ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి. తీరం చేరిన ప్రజాయుద్ధనౌకకు జోహార్’ అని పవన్ కొనియాడారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క నంది అవార్డుల (Nandi Awards) స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. గద్దరన్న పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని ,. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం గద్దర్‌ జయంతి వేడుకలను రవీంద్ర భారతీలో జరుగుతున్నాయి. జయంతి వేడుకల్లో భాగంగా గద్దర్‌ దళం ఆట-పాట సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ‘పాటకు జీవకణం-తరగని గని’ పుస్తకావిష్కరణ జరుగుతుంది.

ఇదిలా ఉంటె సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హెచ్‌ఎండీఏకు చెందిన 1076 చ.గజాల (9గుంట లు) స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లాపూర్‌లో చౌరస్తాను ఆనుకొని ఉన్న హెచ్‌ఎండీఏ స్థలం లో ఇటీవల గద్దర్‌ విగ్రహ ఏర్పా టుకు నిర్మాణ పనులు చేపట్టారు.

Read Also : Vastu tips: రోడ్లపై అలాంటి వాటిని తొక్కుతున్నారా.. అయితే జాగ్రత్త మీరు ప్రమాదంలో పడ్డట్టే?

  Last Updated: 31 Jan 2024, 08:29 PM IST