Site icon HashtagU Telugu

KTR : కేటీఆర్కు ముందుంది ముసళ్ళ పండుగ – మధు యాష్కీ

Madhu Yashki Comments On Kt

Madhu Yashki Comments On Kt

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఫై ..కాంగ్రెస్ నేత మధు యాష్కీ (Madhu Yashki) కీలక వ్యాఖ్యలు చేసారు.కాంగ్రెస్ (Congress) వంద రోజుల పాలన చూసి కేటీఆర్ కు భయం పట్టుకుందని.., ఆయనకు ఆయనక ముసళ్ళ పండగ అని హెచ్చరించారు. భువనగిరి నుంచి తాను పోటీ చేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరినట్లుగా మధుయాష్కీ గౌడ్ తెలిపారు. తనను గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారని… కానీ తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పానన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటదని చెప్పుకొచ్చారు. రెడ్డి సీఎం, ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నారు.. బీసీ నేతకు పీసీసీ వస్తదని తెలిపారు. లా అండ్ అండర్ సీఎం చేతిలో ఉంటుందని వెల్లడించారు. సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ లో ఎ1,ఎ2 గా కేసీఆర్ ,కేటీఆర్ ఉంటారన్నారు. అధికారుల విచారణ అయిన తర్వాతే కేసీఆర్, కేటీఆర్ లను విచారించే అవకాశం ఉందన్నారు. కవిత లిక్కర్ స్కామ్ ఎంతసేపు ఫేక్ కేసు అంటుంది కానీ ,నేరం చేయలేదని చెప్పడం లేదన్నారు.

Read Also : AP BJP Assembly Candidates : ఏపీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన