Largest Cyber Fraud Case : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లో ఇద్దరిని మోసం చేసి ఒక్క రోజులోనే దాదాపు రూ.15 కోట్లను వాళ్లు దొంగిలించారు. అయితే ఒకే వ్యక్తి (విశ్రాంత ఉద్యోగి) నుంచి దాదాపు రూ.13.26 కోట్లను సైబర్ కేటుగాడు కొల్లగొట్టాడు. ఒకే బాధితుడు ఇంత స్థాయిలో మోసపోవడం దేశంలోనే ఇదే తొలిసారి అని పోలీసులు అంటున్నారు. వివరాలివీ..
Also Read :27000 Job Cuts : ఆగస్టులో 27వేల జాబ్స్ కట్.. ఏడాదిలో 1.36 లక్షల ఉద్యోగ కోతలు
హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు ఒక మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాలను అందిస్తామని అందులో రాసి ఉంది. సదరు లింకును క్లిక్ చేసి విశ్రాంత ఉద్యోగి ఓ వాట్సాప్ గ్రూపులో చేరాడు. ఆ గ్రూపులో కొన్ని నకిలీ వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్స్, యాప్‌ల లింక్‌లను సైబర్ కేటుగాళ్లు షేర్ చేశారు. తమను తాము ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీల అధికార ప్రతినిధులుగా సైబర్ మోసగాళ్లు పరిచయం చేసుకున్నారు. అది నిజమేనని విశ్రాంత ఉద్యోగి భావించాడు. వాళ్లు చెప్పిన వెబ్‌సైటుకు వెళ్లి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో డబ్బును తమ బ్యాంకు అకౌంట్లకు పంపాలని సైబర్ కేటుగాళ్లు ఆయనకు సూచించారు. ఆయన వెంటనే మనీని వారికి పంపారు. షేర్లలో ఆ డబ్బును పెట్టుబడిపెట్టామని చెప్పిన కేటుగాళ్లు.. తొలుత కొంతకొంత లాభం వచ్చినట్టుగా ప్రూఫ్స్ చూపించారు. మీకు అవసరమైనప్పుడు ఆ ఫండ్స్‌ను వెనక్కి తీసుకోవచ్చని విశ్రాంత ఉద్యోగిని నమ్మించారు. చివరకు ఆ సైబర్ కేటుగాళ్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు.
Also Read :BIG Move On Agnipath : అగ్నివీరులకు గుడ్ న్యూస్.. అగ్నిపథ్ స్కీంలో కీలక సవరణలు!
దీంతో హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి లబోదిబోమంటూ పోలీసులను(Largest Cyber Fraud Case) ఆశ్రయించాడు. ఈ నెల 2న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)కు ఫిర్యాదు చేశాడు. తన దగ్గరి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.13.26 కోట్లను దొంగిలించారంటూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన మెట్రో రైలు ఉద్యోగి మహ్మద్ అతీర్ పాషా(25) బ్యాంకు ఖాతాకు కొంత సొమ్ము బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో మరో ఇద్దరు యువకుల పాత్ర బయటపడింది. హిమాయత్‌నగర్‌కు చెందిన అరాఫత్ ఖాలేద్ మొహియుద్దీన్(25), చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన సయ్యద్ ఖాజా హషీముద్దీన్(24) తనతో బ్యాంకు ఖాతా తెరిపించారని అతీర్‌పాషా చెప్పాడు. మ్యూల్(కమీషన్ కోసం బ్యాంకు ఖాతాను తెరవడం) అకౌంట్‌గా తన ఖాతాను వినియోగించుకున్నారని అతీర్‌పాషా చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.