Site icon HashtagU Telugu

CM Revanth : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపేందుకు సిద్దమైన సీఎం రేవంత్

CM Revanth Reddy

CM Revanth Reddy

తెలంగాణ సీఎం (Telangana CM) గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు మహిళలకు మరో తీపి కబురు అందించేందుకు సిద్ధం అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2500 సాయం అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా మహిళలే ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా అందించాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీల హామీల దరఖాస్తులను స్వీకరించడం చేస్తుంది. ఈ దరఖాస్తుల్లో ఎక్కువగా నెలకు రూ.2500 సాయం, రేషన్ కార్డ్స్ , ఫ్రీ కరెంట్ వంటి హామీలలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయడం జరిగింది. ఇంకా ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. మొత్తం దరఖాస్తులు అందిన తరువాత మహిళలకు నెలకు రూ.2500 సాయంకు సంబదించిన ప్రకటనను తెలియజేస్తారని తెలుస్తుంది.

Read Also : Earthquake: జపాన్ తర్వాత మయన్మార్‌లో భూకంపం.. 53 సెకన్లు కంపించిన భూమి..!

Exit mobile version