క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నాటి ఘటనలకు సంబంధించి బాల్క సుమన్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చెన్నూర్ కోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆయన విడుదల ఆగిపోయింది. ఈ రెండో కేసుకు సంబంధించిన పీటీ వారెంట్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో 5వ తేదీ తర్వాతే ఆయన విడుదల అవుతారని అందరూ భావించారు.
ఈ క్రమంలో బాల్క సుమన్ తరఫు న్యాయవాదులు నిన్న చెన్నూర్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. పీటీ వారెంట్‌పై విచారణను వెంటనే చేపట్టాలని కోరడంతో కోర్టు అంగీకరించి విచారణ జరిపింది. న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం, ఈ కేసులోనూ బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లోనూ బెయిల్ రావడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు.
