సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో వెలుగుచూసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లిపైనే ఓ కుమారుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణ తీవ్ర సంచలనం రేపుతోంది. మానవత్వం, కుటుంబ విలువలు ఎంతగా దిగజారాయో చెప్పే ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సభ్యసమాజం తలదించుకునే ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో వెలుగుచూసింది. మానవత్వం, కనీస విచక్షణ మరిచిన ఓ యువకుడు తన కన్నతల్లిపైనే లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ జీవనోపాధి కోసం గత కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చింది.
ప్రస్తుతం ఆమె ఘట్‌కేసర్‌లోని ఒక భవనం సెల్లార్‌లో నివసిస్తూ స్థానికంగా ఉంటున్న ఇళ్లలో పని చేస్తోంది. ఆమె మొదటి భర్తకు జన్మించిన రెండో కుమారుడు విజయ్ (25) గత 2 నెలలుగా తల్లి వద్దే ఉంటున్నాడు. అయితే అతడు తరచూ మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవపడుతూ వేధించేవాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన విజయ్, మరోసారి తల్లితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
ఆ తర్వాత తల్లిపైనే లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తల్లి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా విజయ్ బెదిరింపులకు గురిచేసి మళ్లీ దాడి చేసినట్లు ఆమె పోలీసుల ముందు వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ బంధాలను తుంచేసేలా జరిగిన ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
