తెలంగాణలో అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) అమలులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2020 ఆగస్టు 26వ తేదీకి ముందు అభివృద్ధి చేసిన అనుమతిలేని లేఅవుట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో కనీసం 10 శాతం ప్లాట్లు ఇప్పటికే విక్రయించబడి ఉండాలి. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అని అధికారులు స్పష్టం చేశారు. పైగా క్రమబద్ధీకరణ ఫీజుపై 25 శాతం రాయితీ కూడా కల్పిస్తున్నారు.
Location Tracking Device: గూడ్స్, ప్యాసింజర్ వాహనాల్లో ఇక ఆ డివైజ్ తప్పనిసరి !
లేఅవుట్‌కు సంబంధించిన వివరాలను సంబంధిత ప్రాంతంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫీజు చెల్లించి ప్రాసెసింగ్ కోసం ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌కు పంపించాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్‌కు ముందు లేఅవుట్ లేదా అందులోని ప్లాట్లు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, నిషేధిత భూముల్లో లేవని నిర్ధారించుకోవాలి. క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లేఅవుట్లలో మౌలిక వసతులుగా డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, రోడ్లు వంటివి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఈ పథకం కేవలం నివాస ప్లాట్లకే వర్తిస్తుంది, ఫామ్ ప్లాట్లకు అవకాశం లేదు.
Rani Rudrama Devi Airport : వరంగల్ ఎయిర్ పోర్ట్ కు ‘రాణి రుద్రమదేవి’ పేరు పెట్టాలని డిమాండ్
మార్చి నెలాఖరులోగా ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభించనుంది. ఇప్పటికే కొంత రుసుము చెల్లించిన వారు మిగతా మొత్తం చెల్లించే ముందు ఈ రాయితీని ఉపయోగించుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుని, రిజిస్ట్రేషన్ పొందే వీలుంటుంది. దీంతో భూముల లావాదేవీలకు మరింత స్పష్టత రానుండడంతో పాటు, ప్రభుత్వం కూడా అనధికారిక లేఅవుట్ల సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేసింది.