HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికార్డుల ప్రకారం ముష్కిన్ చెరువు 52.20 ఎకరాల ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలో ఉంది. గ్రామ రికార్డుల ప్రకారం […]

Published By: HashtagU Telugu Desk
HYDRAA

HYDRAA

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికార్డుల ప్రకారం ముష్కిన్ చెరువు 52.20 ఎకరాల ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలో ఉంది. గ్రామ రికార్డుల ప్రకారం చెరువు మొత్తం విస్తీర్ణం 59.11 ఎకరాలు. ఇందులో 20.23 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగిలిన భాగం ప్రైవేట్ పట్టా భూమిగా నమోదై ఉంది. చెరువు అభివృద్ధి పేరుతో కొందరు వ్యక్తులు చెరువు మధ్యలో ఆనకట్ట నిర్మించి సుమారు 34.21 ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో చెరువు మధ్యలో నిర్మించిన గట్టును హైడ్రా సిబ్బంది తొలగించారు. పేదల పేరుతో గుడిసెలు నిర్మించి భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గుడిసెవాసులకు ముందుగానే రెండు నెలల గడువు ఇవ్వగా, చాలామంది స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. చెరువు ఎఫ్‌టీఎల్ సరిహద్దులను స్పష్టంగా గుర్తిస్తూ హైడ్రా అధికారులు మొత్తం చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతంతో పాటు మిగిలిన ప్రభుత్వ భూమిని కూడా రక్షించేందుకు హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. నగర పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటల పరిరక్షణకు ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

  Last Updated: 30 May 2026, 06:04 PM IST