Bairanpally : బైరాన్‌పల్లి.. యావత్ తెలంగాణకు గర్వకారణం. ఈ పేరు వినగానే తెలంగాణ గడ్డ పులకించిపోతుంది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలో బైరాన్‌పల్లి గ్రామం ఉంది. 1948 ఆగస్టు 27న ఈ పల్లెలో రజాకార్లు దారుణ నరమేధానికి పాల్పడ్డారు. ఆనాడు రజాకార్లపై వీరోచితంగా పోరాడి ఎంతోమంది బైరాన్‌పల్లి ముద్దుబిడ్డలు అమరులయ్యారు. వారి వీరోచిత పోరాటానికి నేటితో 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఈసందర్భంగా కథనమిది.
We’re now on WhatsApp. Click to Join
- మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజాం నవాబు నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం లభించింది.
- అంటే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా 13 నెలల పాటు తెలంగాణ ప్రాంతం నిజాం నవాబు కబ్జాలోనే ఉండిపోయింది.
- నిజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు, కూలీలు, కార్మికులు వీరోచిత సాయుధ పోరాటం చేశారు.
- ఈ పోరాటంలో 1948 ఆగస్టు 27న జరిగిన బైరాన్‌పల్లి ఘటన ఎంతో చారిత్రాత్మకమైనది.
- ఆ రోజున బైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఊరికి చెందిన 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు. నిజాం సైనిక అధిపతి ఖాసీం రజ్వి ఆదేశాలతో ఈ కాల్పులు జరిపారు.
- రజకార్లు ఆనాడు తెలంగాణలోని గ్రామాలను లూటీ చేసేవారు.
Also Read :KTR : హైదరాబాద్ డెవలప్‌మెంట్‌ను విస్మరిస్తారా ? ఎస్‌ఆర్‌డీపీ పనుల సంగతేంటి ? : కేటీఆర్
- ఈక్రమంలోనే సిద్దిపేట జిల్లాలోని మద్దూరు, లద్నూరు, సలాఖపూర్, రేబర్తి గ్రామాలను రజాకార్లు తమ కేంద్రాలుగా వాడుకునేవారు. ఆ గ్రామాల్లో ఉంటూ సమీప పల్లెలపై దాడులకు తెగబడేవారు. ప్రజల సంపదను దోచుకునేవారు.
- రజాకార్లను ఎదిరించేందుకు ఆనాడు ఎంతోమంది గ్రామీణ యువత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు.
- బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట ప్రాంతాల్లో యువకుల రక్షక దళాలు పనిచేశాయి. వీటికి కేంద్రంగా బైరాన్‌పల్లి ఉండేది.
- 1948 ఆగస్టులో రజాకార్లు లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై దాడి చేసి సొమ్మును దోచుకున్నారు.
- ఆ సంపదను దోచుకొని వెళ్తుండగా బైరాన్‌పల్లి(Bairanpally) సమీపంలోకి రాగానే సమరయోధులు దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలోని రక్షణ గెరిల్లా దళాలు దాడిచేశాయి. దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నాయి.
- ఈ ఘటనతో బైరాన్‌పల్లి గ్రామంపై రజాకార్లు కసి పెంచుకున్నారు.
- దీంతో బైరాన్‌పల్లి గ్రామస్థులు చుట్టూ గోడ ఏర్పాటు చేసి మధ్యలో ఉన్న ఎత్తయిన బురుజును స్థావరంగా చేసుకుని ఊరిని రక్షించుకున్నారు.
- రజాకార్లు రెండు సార్లు ఈ ఊరిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు.
- ఆ దళాల్లో పనిచేసే యువతను భయపెట్టే లక్ష్యంతో 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు.
- ఆగస్టు 27న వేకువజామున బైరాన్‌పల్లి గ్రామస్తులు నిద్రిస్తుండగా, అప్పటి డిప్యూటీ కలెక్టరు హషీం 500 మంది సైన్యంతో ఊరిపై దాడి చేశారు. సైనికులు గ్రామంలోకి చొరబడి అందరినీ కాల్చి చంపారు.
- బురుజుపై తలదాచుకున్న 40 మందిని, పలుచోట్ల దొరికిన 56 మంది యువకులను బంధించి ఊరి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లి కాల్చి చంపారు.