Site icon HashtagU Telugu

WhatsApp Green Tick : వాట్సాప్ యూజర్లకూ గ్రీన్ టిక్.. ఎన్ని బెనిఫిట్సో​!

Whatsapp Green Tick

Whatsapp Green Tick

WhatsApp Green Tick : మీకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉందా ? ఒకవేళ  ఉంటే.. మీలాంటి వారి కోసం కొత్తకొత్త ఫీచర్లను వాట్సాప్ కంపెనీ రెడీ చేస్తోంది. వాట్సాప్ బిజినెస్ అకౌంటును వాడే వాళ్లకు ఇక గ్రీన్ టిక్‌ను కూడా కేటాయించనున్నారు. ఇందుకోసం యూజర్లు  మెటా వెరిఫికేషన్​కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అందిన తర్వాత మీ అకౌంటును కంపెనీ వేరిఫై చేసి, గ్రీన్ టిక్‌ను కేటాయిస్తుంది. గ్రీన్ టిక్‌ను వెరిఫికేషన్​ బ్యాడ్జ్​ అని పిలుస్తారు. ఇప్పటికైతే ఈ బ్యాడ్జీని ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేయడం లేదు. భవిష్యత్తులో ఇందుకోసం నామమాత్రంగా కొంత ఛార్జీని వసూలు చేసే అవకాశం  ఉందనని భావిస్తున్నారు. ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్, వాట్సాప్.. ఇవన్నీ మెటా కంపెనీ సోషల్ మీడియా వేదికలే. గ్రీన్ టిక్‌ను పొందే మెటా వేరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్  ఫీచర్‌ను ఇప్పటికే ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్ యూజర్లకు మెటా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై దీన్ని వాట్సాప్ బిజినెస్ అకౌంటు యూజర్లు కూడా పొందనున్నారు.  వాస్తవానికి కొన్ని దేశాల్లో గతేడాది సెప్టెంబర్​లోనే మెటా వేరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను వాట్సాప్ బిజినెస్ యాప్​ వాడేవారి కోసం అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఇప్పుడు ఇండియా,  బ్రెజిల్​, ఇండోనేషియా, కొలంబియా దేశాల్లో ఈ ఫీచర్‌ను(WhatsApp Green Tick) అందిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

లాభం ఏమిటి ?

Also Read :Purandeshwari : పురందేశ్వ‌రికి లోక్‌సభ స్పీకర్ పదవి ?

Also Read :Ravneet Singh Bittu : మంత్రి పదవి ఆఫర్.. పరుగులు పెడుతూ పీఎంఓకు.. వీడియో వైరల్