19Pro 5G: టెక్నో కెమాన్ 19 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు ఇవే!

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో తాజాగా భారత మార్కెట్ లోకి టెక్నో కెమాన్ 19ప్రో 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ని

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 10:30 AM IST

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో తాజాగా భారత మార్కెట్ లోకి టెక్నో కెమాన్ 19ప్రో 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ ని వినియోగదారులు మెచ్చే అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఫోన్లో కెమెరా ప్రియులు నచ్చే ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సార్ లను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఫోటోలు తీసినప్పుడు బ్లర్ కాకుండా మరింత స్పష్టంగా క్లారిటీగా తీసుకోవచ్చు.

టెక్నో కెమాన్ 19 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ తో వచ్చే ఈ మొబైల్ ధర రూ.,21,999 గా వుంది. ఈ ఫోన్ మనకు సెడార్ గ్రీన్, ఎకో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అలాగే టెక్నో వెబ్సైట్ తో పాటుగా ఆన్లైన్ స్టోర్ ల నుంచి కూడా ఈ మొబైల్ ఫోన్ ని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ డిస్ప్ ప్లే 6.8 అంగుళాలు ఫుల్ హెచ్ డి గా ఉంటుంది. 120 గిగాహెర్జ్ రీ ఫ్రెష్ రేటుతో లభిస్తోంది. అలాగే మీడియా టెక్ డైమిన్సిటీ 810 ఎస్ వోసి చిప్ సెట్ తో పనిచేస్తుంది.

ఈ మొబైల్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అందులో ఒకటి 64 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంటుంది. ఇక ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు. మైక్రో ఎస్ డి కార్డు తో స్టోరేజీ పెంచుకోవచ్చు. 4 జీ వోల్టేజ్ తో పాటుగా,5జీలో 12 బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ,33 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వేగంగా చార్జింగ్ పెట్టుకోవచ్చు.