India vs England: 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. నేడు గెలిచిన జట్టు మార్చి 8న జరగబోయే ఫైనల్‌లో కివీస్‌తో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే ఫైనలిస్ట్ జట్టును ఎలా నిర్ణయిస్తారు? ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
వర్షం పడితే ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?
భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దయితే ‘రిజర్వ్ డే’ నిబంధన అమలులో ఉంటుంది. అంటే ఈరోజు (మార్చి 5) సెమీఫైనల్ మ్యాచ్ జరగకపోతే దానిని రిజర్వ్ డే అయిన మార్చి 6న నిర్వహిస్తారు. ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం.. 2026 టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డేని కేటాయించారు. అలాగే ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా జరగకపోతే దానిని మరుసటి రోజు అంటే మార్చి 9న నిర్వహిస్తారు.
Also Read: Instagram : ఇన్‌స్టాగ్రామ్..టీనేజ్ యువతను ప్రమాదంలో పడేస్తుందా ? మెటా నివేదికల్లో సంచలన విషయాలు !!
రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడితే?
ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫైనల్‌కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు. సూపర్-8 దశలో ఇంగ్లాండ్ తమ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి 6 పాయింట్లతో ఉండగా టీమ్ ఇండియా కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. కాబట్టి రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగని పక్షంలో పాయింట్ల పట్టికలో ఎక్కువ పాయింట్లు ఉన్న ఇంగ్లాండ్ జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత జట్టుకు శుభవార్త ఏంటంటే వర్షం కారణంగా మ్యాచ్‌కి ఎటువంటి అంతరాయం కలిగే అవకాశం లేదు. నేడు ముంబై వాతావరణం చాలా స్పష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 28°C నుండి 31°C వరకు ఉండే అవకాశం ఉంది.
