Kohli Post: కోహ్లీ భావోద్వేగ ట్వీట్.. ఫ్యాన్స్ రియాక్షన్ అదుర్స్

ఐపీఎల్ 2023 సీజన్ నుండి కోహ్లీ సేన నిష్క్రమించింది. అయినప్పటికీ కోట్లాది మంది ఆర్సీబీ అభిమానులు కోహ్లీని సపోర్ట్ చేస్తున్నారు. కప్ గెలవకపోయిన పర్వాలేదు నువ్వేం బాధపడకు భాయ్ అంటూ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Kohli Post

New Web Story Copy 2023 05 23t174011.921

Kohli Post: ఐపీఎల్ 2023 సీజన్ నుండి కోహ్లీ సేన నిష్క్రమించింది. అయినప్పటికీ కోట్లాది మంది ఆర్సీబీ అభిమానులు కోహ్లీని సపోర్ట్ చేస్తున్నారు. కప్ గెలవకపోయిన పర్వాలేదు నువ్వేం బాధపడకు భాయ్ అంటూ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ప్లే ఆఫ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో బెంగుళూరు పోటీపడింది. ఈ పోరులో టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఆర్‌సిబిపై విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కోహ్లీ భావోద్వేగ ట్వీట్ చేశారు.

ఈ సీజన్‌లో ఆర్‌సిబి అద్భుతంగా రాణించింది. కోహ్లీ ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా అవతరించాడు. ఒకానొక సమయంలో ఆర్‌సిబి ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుందని అందరికీ ఆశలు కల్పించింది. చివరికి అది జరగకపోవడంతో మరోసారి ఆర్‌సిబి అభిమానులకు నిరాశ తప్పలేదు. చివరి లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్భుత సెంచరీతో ఆడి జట్టు స్కోరుకు సహకరించాడు. అయితే శుభ్‌మన్ గిల్ సెంచరీ ముందు కోహ్లి సెంచరీ వృథా అయింది.

విరాట్ కోహ్లీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌లో విరాట్ కోహ్లీ ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయామని, తనకు మద్దతు ఇచ్చిన అభిమానులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అంటూ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశాడు. దీంతో ఫాన్స్ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. కప్ కంటే నీ ఆటంటే మాకిష్టం భాయ్ అని సపోర్ట్ చేస్తున్నారు. ఆర్సీబీ కప్ కొట్టినా, కొట్టకపోయినా వీ ఆర్ విత్ యూ అంటూ ఫాన్స్ మద్దతు తెలుపుతున్నారు.

Read More: IPL 2023 Qualifier 1: ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో ? ప్లే ఆఫ్ సమరానికి చెన్నై.గుజరాత్ రెడీ

  Last Updated: 23 May 2023, 06:05 PM IST