15 ఏళ్ల కుర్రాడు.. ఐపీఎల్ 2026 సూపర్ స్టార్‌గా నిలిచాడు. అతనే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. తనదైన శైలిలో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ ఓడిపోవడంతో ఈ జట్టు ఇంటిబాట పట్టింది. అయితే ఆ మ్యాచ్‌లోనే వైభవ్ కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో శతకాన్ని కోల్పోయినా, అతని దూకుడైన బ్యాటింగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సీజన్ మొత్తం వైభవ్ అద్భుత ఆటతీరుతో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యంత వేగంగా 1000 ఐపీఎల్ పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా నిలవడమే కాకుండా, పవర్‌ప్లేలో 500కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలవకపోయినా, ఐపీఎల్ 2026లో అతిపెద్ద సంచలనంగా, భవిష్యత్ భారత క్రికెట్ స్టార్‌గా వైభవ్ సూర్యవంశీ తన ముద్ర వేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. పరుగులు, స్ట్రైక్‌రేట్, సిక్సర్లు, వ్యక్తిగత అవార్డులు.. ప్రతి విభాగంలోనూ తన ఆధిపత్యాన్ని చాటుతూ సీజన్ మొత్తాన్ని శాసించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతలు సాధించిన వైభవ్, భవిష్యత్ భారత క్రికెట్‌కు సరికొత్త ఆశాకిరణంగా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ సాధించిన ఘనతలు ఇవే.. సీజన్ ఉత్తమ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు, సీజన్ సూపర్ స్ట్రైకర్ అవార్డు( స్ట్రైక్ రేట్: 237.30), సీజన్ సూపర్ సిక్సర్ అవార్డు (మొత్తం 72 సిక్సర్లు), ఆరెంజ్ క్యాప్ విజేత(776 పరుగులు) టోర్నమెంట్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP)గా అవార్డులు పొందాడు
