ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు. దీంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఝులిపించారు. ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ జట్టు విజయంతో అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి గుమిగూడారు. ఈ సంబరాల సమయంలో, అభిమానులు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తూ ట్రాఫిక్ నిలిపివేసిన అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీఛార్జ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లితో సహా పలు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
HYD : ఐపీఎల్ సంబరాలు.. హైదరాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు. దీంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఝులిపించారు. ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ జట్టు విజయంతో అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి గుమిగూడారు. ఈ సంబరాల సమయంలో, అభిమానులు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తూ ట్రాఫిక్ నిలిపివేసిన అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి […]

RCB FANS
Last Updated: 01 Jun 2026, 09:22 AM IST