Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 32వ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ ఒక భారీ రికార్డును బద్దలు కొడుతూ కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.
చరిత్ర సృష్టించాడు
రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన 15 ఏళ్ల మెరుపు బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసినప్పటికీ దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
Also Read: కాపురంలో చిచ్చు పెట్టిన నైటీ..!
అత్యంత వేగంగా 500 పరుగులు పూర్తి
LSGపై ఆడుతున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. వైభవ్ కేవలం 227 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో 250 కంటే తక్కువ బంతుల్లో 500 పరుగుల మార్కును తాకిన మొదటి ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.
మాక్స్‌వెల్ రికార్డు బద్దలు
గతంలో ఈ రికార్డు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. మాక్స్‌వెల్ 260 బంతుల్లో 500 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాన్ష్ ఆర్య (280 బంతులు), వీరేంద్ర సెహ్వాగ్ (280 బంతులు), నమన్ ధీర్ (283 బంతులు) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 2 పరుగులు పూర్తి చేయగానే వైభవ్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుత ప్రదర్శన
తన అరంగేట్రం (ఐపీఎల్ 2025) సీజన్‌లోనే 252 పరుగులు చేశారు. 206.56 స్ట్రైక్ రేట్‌తో “బెస్ట్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ తన స్ట్రైక్ రేట్‌ను 240కి పెంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో సహా 254 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు.
