ఐపీఎల్ – 2026 సీజన్ విజేతగా ఆర్సీబీ మరోసారి నిలిచింది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్.. 2026 సీజన్‌లో కూడా గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి.. రెండోసారి టైటిల్‌ని గెలుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ తన అద్భుతమైన బౌలింగ్‌తో గుజరాత్‌ని కట్టడి చేసింది. ఓపెనర్లు గిల్, సుదర్శన్‌లను ఆర్సీబీ బౌలర్లు అవుట్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 156 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నిరాశపరచగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు.
156 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన ఆర్సీబీ గుజరాత్ బౌలర్లపై చెలరేగారు. విరాట్ కోహ్లి తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్సీబీని విజయతీరాలకి చేర్చాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి రషీద్ ఖాన్ కీలక వికెట్లు తీసినప్పటికి విరాట్ కోహ్లి ఫ్లోర్లు, సిక్సర్లతో స్కోరుని పరుగులు పెట్టించాడు. 64 పరుగుల వద్ద విరాట్ కోహ్లి కొట్టిన షాట్ ఫీల్లర్ చేతిలోకి వెళ్లినప్పటికి అది రివ్యూలో గ్రౌండ్‌కి టచ్ అయినట్లు తేలడంతో కోహ్లీకి లైఫ్ దొరికింది. దీంతో గుజరాత్ గెలుపుపై నీళ్లు చల్లినట్లు అయింది.
Rcb Wiinner
