IPL 2026: ఐపీఎల్ 2026లో టీమ్ ఇండియాకు చెందిన కొందరు స్టార్ ప్లేయర్లు అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశపరుస్తున్నారు. వీరి ఫామ్ లేమి కారణంగా సదరు ఫ్రాంచైజీలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అలాగే టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ ప్రదర్శనపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026లో విఫలమవుతున్న ఆ ఐదుగురు స్టార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
తిలక్ వర్మ
ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ఐపీఎల్‌లో మాత్రం తడబడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 8.75 సగటుతో కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read: ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ?!
జస్ప్రీత్ బుమ్రా
ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన కూడా ఈ సీజన్‌లో ఆందోళన కలిగిస్తోంది. 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆయన ఎకానమీ రేట్ (8.20) ఫర్వాలేదనిపిస్తున్నా వికెట్లు పడకపోవడం ముంబై జట్టును వేధిస్తోంది.
అక్షర్ పటేల్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమవుతున్నాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన అక్షర్, బౌలింగ్‌లో 36.67 సగటుతో కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు.
అర్ష్‌దీప్ సింగ్
వేగవంతమైన బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ సీజన్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో 10.64 ఎకానమీ రేట్‌తో పరుగులిస్తూ, కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అర్ష్‌దీప్ బౌలింగ్ సగటు (74.50) అత్యంత దారుణంగా ఉంది.
వరుణ్ చక్రవర్తి
స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం గాయం కారణంగా ప్లేయింగ్ 11 నుండి కూడా దూరమయ్యాడు. గాయపడటానికి ముందు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా.. 13.17 ఎకానమీ రేట్‌తో దారుణంగా పరుగులు ఇచ్చాడు. దీంతో జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది.
