CSK vs KKR: వరుసగా మూడు ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ తన పాత ఫామ్‌ను ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సిఎస్‌కె 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
గౌరవప్రదమైన స్కోరు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 32 బంతుల్లో 48 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. నంబర్ 3లో వచ్చిన ఆయుష్ మ్హత్రే కేవలం 17 బంతుల్లోనే 38 పరుగులు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ 29 బంతుల్లో కీలకమైన 41 పరుగులు చేశాడు. చివరిలో సర్ఫరాజ్ ఖాన్ (23), శివమ్ దూబే (నాటౌట్ 13) రాణించడంతో సిఎస్‌కె 192 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి 2 వికెట్లు తీయగా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read: సీఎస్కే కెప్టెన్ పేలవ ఫామ్.. చెత్త షాట్‌తో ఔట్!
రహానే నెమ్మదైన బ్యాటింగ్.. కేకేఆర్‌కు భారీ నష్టం
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శుభారంభం లభించలేదు. ఫిన్ అలెన్ కేవలం 1 పరుగుకే అవుట్ కాగా, సునీల్ నరైన్ 17 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్ అజింక్య రహానే అత్యంత నెమ్మదిగా ఆడి 22 బంతుల్లో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ స్లో ఇన్నింగ్స్ వల్ల ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. అంగ్క్రిష్ రఘువంశీ (17) త్వరగానే అవుట్ అవ్వగా, కామెరాన్ గ్రీన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. చివరలో రోవ్‌మన్ పావెల్ (నాటౌట్ 31), రమణ్‌దీప్ సింగ్ (35) పోరాడినప్పటికీ కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. సిఎస్‌కె బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లతో చెలరేగగా, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు సాధించాడు.
