Ajinkya Rahane: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ పడగానే అజింక్య రహానే ఒక భారీ మైలురాయిని చేరుకున్నాడు. ఇది రహానేకు 200వ ఐపీఎల్ మ్యాచ్. ఈ ఘనత సాధించిన టోర్నీ చరిత్రలోనే 11వ ఆటగాడిగా రహానే నిలిచాడు. గత సీజన్‌లోనే రహానే 192 మ్యాచ్‌లు ఆడిన పీయూష్ చావ్లా రికార్డును అధిగమించాడు.
ధోనీ అగ్రస్థానం
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. ధోనీ ఇప్పటివరకు 278 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (273 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉండగా, ఆర్‌సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ (268 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read: భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?
రాయుడు రికార్డుపై కన్ను
ప్రస్తుతం రహానే లక్ష్యం అంబటి రాయుడు రికార్డును అధిగమించడం. రాయుడు 2010 నుండి 2023 వరకు మొత్తం 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. రహానేకు గాయాలు కాకుండా ఉంటే ఈ సీజన్‌లోనే రాయుడును సులభంగా వెనక్కి నెట్టేస్తాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో రవీంద్ర జడేజా 255 మ్యాచ్‌లతో జాబితాలో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా
- ఎంఎస్ ధోనీ- 278 మ్యాచ్‌లు
- రోహిత్ శర్మ- 273 మ్యాచ్‌లు
- విరాట్ కోహ్లీ- 268 మ్యాచ్‌లు
- దినేష్ కార్తీక్- 257 మ్యాచ్‌లు
- రవీంద్ర జడేజా- 255 మ్యాచ్‌లు
- శిఖర్ ధావన్- 222 మ్యాచ్‌లు
- రవిచంద్రన్ అశ్విన్- 221 మ్యాచ్‌లు
- సురేష్ రైనా- 205 మ్యాచ్‌లు
- రాబిన్ ఉతప్ప- 205 మ్యాచ్‌లు
- అంబటి రాయుడు- 204 మ్యాచ్‌లు
- అజింక్య రహానే- 200* మ్యాచ్‌లు
