AP : చంద్రబాబు ఫై ఏపీ సర్కార్ మరో కుట్ర..? ఏకంగా ఫోన్ కాల్స్ చేసి..

చంద్రబాబు పేరుతో ప్రజలకు వాయిస్ కాల్స్ చేస్తూ టీడీపీపై దుష్ప్రచారం చేస్తోంది

Published By: HashtagU Telugu Desk
ACB Court

Chandrababu Naidu Meets his Family at SIT Office

చంద్రబాబు ను వైసీపీ సర్కార్ (YCP Govt) వదలడం లేదు..ఇప్పటికే సంబంధం లేని కేసులో చంద్రబాబు ను జైల్ కు పంపించిన జగన్..ఇప్పుడు మరో భారీ కుట్రకు తెరలేపినట్లు టీడీపీ (TDP) వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు పేరుతో ప్రజలకు వాయిస్ కాల్స్ చేస్తూ టీడీపీపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో చంద్రబాబు (Chandrababu Arrest)ను అరెస్ట్ చేయడం పట్ల ఏపీలో లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తప్పుపడుతున్నారు. రాజకీయ పార్టీ అలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో తమ నిరసనలను తెలియజేయగా..ఏపీలో నిరసనలు , బంద్ లు కొనసాగుతున్నాయి. మరోపక్క రాజమండ్రి జైల్లో చంద్రబాబు కు ప్రాణ హాని ఉందంటూ పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇలా వరుస సంఘటనలు జరుగుతుండగా..తాజాగా ఏపీ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరలేపడం టీడీపీ శ్రేణుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతుంది.

Read Also : AI Tea Stall: కరీంనగర్ లో AI టీ స్టాల్, ఓనర్ లేకుండానే టీ తాగొచ్చు ఇక!

చంద్రబాబు పేరుతో ప్రజలకు వాయిస్ కాల్స్ చేస్తూ టీడీపీపై దుష్ప్రచారం చేస్తోంది. 040 69131484 నంబరు నుంచి ఈ ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు టీడీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నంబర్ నుంచి ఫోన్ రాగానే చంద్రబాబు చేసిన స్కాంలు అంటూ వాయిస్ ప్లే అవుతోంది. ఈ కాల్స్‌పై ఏపీ వ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రచారానికి వినియోగించే ఈ విధానాన్ని ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో టీడీపీ లక్ష్యంగా అమలు చేస్తుండటం జగన్ కుట్రేనని.. టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ ఫోన్ కాల్స్ ఏపీలోని చాలా మందికి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

  Last Updated: 13 Sep 2023, 01:58 PM IST