గౌరవ ‘కళైమామణి’ అవార్డును అందుకున్న నటుడు యోగి బాబు కు ఫాదర్ ప్రమోషన్ వచ్చింది. నటుడి భార్య మంజు భార్గవి అక్టోబర్ 23న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. యోగి బాబు 2020లో తిరుత్తణి ఆలయంలో మంజు భార్గవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే వేషగన్ అనే కుమారుడు జన్మించాడు. యోగి బాబు కమెడియన్‌గా స్థిరపడిన తర్వాత, ‘మండేలా’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో అద్భుతమైన నటనతో నటుడిగా తన సత్తాను నిరూపించుకున్నాడు. అతనికి కుమార్తె పుట్టడంతో దీపావళి పండుగ మరిన్ని వెలుగులు తెచ్చింది.
Yogi Babu Promotion: యోగి బాబుకు ఫాదర్ ప్రమోషన్
గౌరవ 'కళైమామణి' అవార్డును అందుకున్న నటుడు యోగి బాబు కు ఫాదర్ ప్రమోషన్ వచ్చింది.

Yogibabu
Last Updated: 26 Oct 2022, 01:36 PM IST