Site icon HashtagU Telugu

Delhi : భర్తను బ్లాక్ మెయిల్ చేస్తోన్న భార్య…అత్తామామల ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానంటూ వార్నింగ్..!!

Mobile Phones

Mobile Phones

ప్రియుడితో కలిసి ఓ మహిళ..భర్తను టార్చర్ పెడుతున్న ఘటన ఢిల్లీలో జరిగింది.ఇంట్లో ఉన్న కోటిరూపాయలకు పైగా తీసుకొని వెళ్లిపోయిన మహిళ…తనపై కేసు వెనక్కి తీసుకోకుండా అత్తమామలు ప్రైవేట్ గా ఉన్న వీడియోలు బయపెడతానంటూ భర్తకు వార్నింగ్ ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….ఢిల్లీలోని లక్ష్మీనగర్ కు చెందిన జ్యూవెల్లరీ షాప్ యజమానికి భార్యతో గొడవలు జరిగాయి. దీంతో గత 4ఏళ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు.

ఈ క్రమంలో అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని భర్త తెలుసుకున్నాడు. దీంతో తన విషయం భర్తకు తెలిసిపోవడంతో..ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ప్లాన్ చేసింది. ఒక రోజు ప్రియుడితో ఇంట్లో ఉన్న కోటిరూపాయలకు పైగా బంగారం ఆభరణాలతోపాటు కొంత నగదు తీసుకుని జంప్ అయ్యింది. దీంతో ఆమె భర్త పోలీసులకు కంప్లైట్ చేశాడు.

తనపై కేసు నమోదైందని తన కోసం వెతుకుతున్నారని…తెలుసుకున్న ఆ మహిళకు భర్తకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది. కేసు వెనక్కి తీసుకోకుంటే…అత్తమామలు సన్నిహితంగా ఉన్న వీడియోలు లీక్ చేస్తానంటూ హెచ్చరించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు భర్త. దీంతో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Exit mobile version