Snake in Ear: మహిళ చెవిలోకి దూరిన పాము.. వైరల్ వీడియో.. కానీ?

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా అందులో జంతువులకు

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 06:20 PM IST

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా అందులో జంతువులకు సరిసృపాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. సరిసృపాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి అనకొండ పాము ఇలా భూమిపై పాకేజీవులు. అయితే ఇప్పటికే పాములకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం నెటిజన్స్ ని భయభ్రాంతులకు గురిచేస్తుంది.

ఆ వీడియోలో చిన్న సైజు పాము ఏకంగా మహిళ చెవిలో దూరింది. వినడానికి భయంకరంగా ఉన్న ఆ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఒక మహిళా తన చెవిలో పాము దూరడంతో ఆసుపత్రికి వచ్చింది. వెంటనే ఆ మహిళ పట్ల స్పందించిన వైద్యులు ఆమెను ఒక బెడ్ పై పడుకోబెట్టి ఆ పామును చెవిలో నుంచి బయటకు తీయడానికి విధాలుగా ప్రయత్నించారు కానీ ఆ పాము శరీర భాగం మాత్రం లోపల ఉండిపోయింది. తల మాత్రమే బయటకు కనిపిస్తూ ఉండడంతో దానిని బయటకు రావడానికి డాక్టర్లు చాలా ప్రయత్నించారు.

 

అయితే ఆ మహిళ చెవిలో నుంచి ఆ పామును తొలగించారా లేదా అన్నది తెలియక ముందే ఆ వీడియో పూర్తి అవుతుంది. అయితే ఆ వీడియోని చూసిన కొందరు ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు మాత్రం ఆ మహిళ ఎంత బాధ పడుతుందో అంటూ మహిళ పరిస్థితిని తలుచుకునే బాధపడుతున్నారు. ఈ వీడియోలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.