Pakistani Dance: ఆ అమ్మాయి డాన్సుకు నెటిజన్లను ఫిదా… నోరాను తలపిస్తున్న పాకిస్థానీ బ్యూటీ!

సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత మారుమూల పల్లెలో దాగి ఉన్న టాలెంట్‌ కూడా బయటకు వస్తోంది. వివిధ రకాల యాప్‌లను ఉపయోగించి, ఆయా ప్లాట్‌ ఫాంల మీద తమ టాలెంట్‌ను బయట పెడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 02 17 At 21.44.01

Whatsapp Image 2023 02 17 At 21.44.01

Pakistani Dance: సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత మారుమూల పల్లెలో దాగి ఉన్న టాలెంట్‌ కూడా బయటకు వస్తోంది. వివిధ రకాల యాప్‌లను ఉపయోగించి, ఆయా ప్లాట్‌ ఫాంల మీద తమ టాలెంట్‌ను బయట పెడుతున్నారు. ఇలానే పాకిస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయి వేసిన డాన్స్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. లక్షల మంది లైకులతో ఆ వీడియో మారుమోగిపోతోంది.

ఇటీవల కాలంలో కొన్ని డ్యాన్స్ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఓ అందమైన అమ్మాయి వేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్ల రూపంలో ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘సత్య మేవ జయతే2’ సినిమాలోని ‘కుసు కుసు’ పాట విడుదలైన దగ్గరి నుంచి సినీ ప్రియులను ఆకర్షిస్తూనే ఉంది.

తాజాగా ఓ పాకిస్థానీ అమ్మాయి హోయలుపోతూ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం అందరి మనసులను కొల్లకొడుతోంది. కుర్రకారు అయితే ఆ వీడియోను తెగ చూసే చూస్తున్నారు. ఎవర్రా ఈ అమ్మాయి అని తెగ పొగిడేస్తూ, ఆమె గురించి సర్చ్‌ చేస్తున్నారు. ‘సూపర్ టాలెంట్’ అని ఒరిజినల్ కంటే బాగుందంటూ ఆమెను కాంప్లిమెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు లక్షల మందికి ఫేవరేట్‌గా మారింది. సినిమాలో నోరా ఫతేహి తన కిల్లంగ్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారును అల్లాడించగా, ప్రస్తుతం ఈ పాకిస్థానీ అమ్మా యి తన అందమైన స్టెపులతో మదిని దోచేస్తోంది.

  Last Updated: 17 Feb 2023, 09:53 PM IST