గత రెండు రోజులుగా గుంటూరులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొంతమంది అనుమానస్పదంగా తిరుగుతుడటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది.. వీరంతా పెద్ద సంఖ్యలో ప్రజలు గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో కనిపిస్తున్నారు. పగలంతా రోడ్లపై తిరుగుతూ, రాత్రిపూట స్టేషన్ దగ్గరే ఉంటున్నారు. ముఖ్యంగా వీరిలో మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. వారితో పాటు వచ్చిన పురుషులు ఎక్కడివారనే దానిపై ప్రజల్లో కూడా అనుమానం వ్యక్తమవుతోంది. వారికి తెలుగు రాకపోవడం, ఎక్కడినుంచి వచ్చారని అడిగితే, వారు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని స్థానికులు చెప్తున్నారు. వారి ప్రవర్తన స్థానికులలో అనుమానాలకు కారణమవుతోంది. అయితే, నిర్ధారణ లేకుండా ఎవరిపైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా సరికాదనే ఉద్దేశంతో స్థానికులు ఉన్నారు. దీనిపై పోలీసులు, సంబంధిత అధికారులు ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి, అసలు వివరాలను బహిర్గతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Gunturu : గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతన్న వ్యక్తులు.. స్థానికుల్లో ఆందోళన
గత రెండు రోజులుగా గుంటూరులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొంతమంది అనుమానస్పదంగా తిరుగుతుడటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది.. వీరంతా పెద్ద సంఖ్యలో ప్రజలు గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో కనిపిస్తున్నారు. పగలంతా రోడ్లపై తిరుగుతూ, రాత్రిపూట స్టేషన్ దగ్గరే ఉంటున్నారు. ముఖ్యంగా వీరిలో మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. వారితో పాటు వచ్చిన పురుషులు ఎక్కడివారనే దానిపై ప్రజల్లో కూడా అనుమానం వ్యక్తమవుతోంది. వారికి తెలుగు రాకపోవడం, ఎక్కడినుంచి వచ్చారని అడిగితే, వారు స్పష్టమైన సమాధానం […]

Gunturu Railway Station
Last Updated: 25 May 2026, 10:45 PM IST