అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తాని చాటారు. విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) సాయంతో గుర్తించి కేవలం 25 నిమిషాల్లో క్షేమంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుకు సంబంధించిన బాలిక వివరాలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అదే సమయంలో ఆ వివరాలను ఆర్‌టీజీఎస్ సిస్టమ్‌లో కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఆర్‌ఎస్ కెమెరాల్లో ఆ బాలిక కనిపించింది. వెంటనే కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తమై సీసీఎస్ పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన పోలీసులు బాలికను గుర్తించి భద్రంగా అదుపులోకి తీసుకుని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నేరాల నియంత్రణతో పాటు తప్పిపోయిన వారి ఆచూకీ గుర్తించడంలో ఆధునిక సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ప్రజల భద్రతే లక్ష్యంగా ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.
Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తాని చాటారు. విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) సాయంతో గుర్తించి కేవలం 25 నిమిషాల్లో క్షేమంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుకు సంబంధించిన బాలిక వివరాలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అదే సమయంలో ఆ వివరాలను […]

Missing Case
Last Updated: 25 May 2026, 08:18 PM IST