AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న రూరల్ అవుట్ పోస్టులను సీఎం ప్రారంభించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ […]

Published By: HashtagU Telugu Desk
Msme Summit 2026

Msme Summit 2026

ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న రూరల్ అవుట్ పోస్టులను సీఎం ప్రారంభించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ సెంటర్లు ఏర్పాటు చేయగా, ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలుగా పనిచేయనున్నాయి. ఆర్టీఐహెచ్‌తో కలిసి కియా ఇండియా అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. హైఎండ్ ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ ద్వారా స్టార్టప్‌లకు సాంకేతిక సహకారం అందించనున్నారు. డీప్ టెక్ స్టార్టప్‌లకు ఆర్థిక చేయూతగా సిడ్బీతో కలిసి రూ.20 కోట్ల సీడ్ ఫండ్ ప్రోగ్రామ్ ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది.

రాష్ట్రంలోని లక్ష మంది ఎంఎస్ఎంఈల డిజిటల్ మెచ్యూరిటీ అసెస్మెంట్‌లో భాగంగా వివిధ కళాశాలల్లో 50 డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐటీ శాఖల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. వెయ్యి ఎంఎస్ఎంఈలలో ఎనర్జీ, వాటర్ ఆడిట్స్ నిర్వహించేందుకు ఎస్సెల్ సంస్థ ముందుకు వచ్చింది. రూ.200 కోట్ల వ్యయంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టి 750 ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడంతో పాటు 3,125 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దివ్యాంగ యువతకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 10 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరంతో ఒప్పందం కుదిరింది. లక్ష ఎంఎస్ఎంఈలకు టెక్నాలజీ అడాప్షన్, డిజిటల్ రెడీనెస్‌పై శిక్షణ ఇచ్చేందుకు వోడాఫోన్ ఐడియా బిజినెస్‌తో భాగస్వామ్యం ఏర్పడింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం జోహో సంస్థతోనూ ఒప్పందం కుదిరింది.

ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌తో ఒప్పందం చేసుకోగా, ఎగుమతులు, క్రాస్ బోర్డర్ ట్రేడ్‌కు లాజిస్టిక్స్ సపోర్ట్ అందించేందుకు ఆరామెక్స్ సంస్థ ముందుకు వచ్చింది. మైక్రో ఎంటర్‌ప్రైజెస్ సామర్థ్యాల పెంపు కోసం మెటా సంస్థ చేయూత అందించనుండగా, ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు, సర్టిఫికేషన్ అంశాల్లో సహకారం అందించేందుకు క్యూసీఐ ఒప్పందం చేసుకుంది. ఎంఎస్ఎంఈల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు, ఆర్థిక భద్రత అంశాల్లో సహకారం అందించేందుకు పీఎఫ్ఆర్డీఏ భాగస్వామ్యమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డీబీవీ స్వామి, ప్రజాప్రతినిధులు, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

  Last Updated: 25 May 2026, 09:29 PM IST