Scorpion venom: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిక్విడ్‌గా తేలు విషం. రూ. కోట్లలోనే..

ప్రపంచంలో విషపూరితమైన జీవులలో తేలు కూడా ఒకటి. తేలు కుడితే మనుషులు అసలు తట్టుకోలేరు. భరించలేనంతగా నొప్పి ఉంటుంది. తేలు విషం శరీరం మొత్తానికి ప్రవేశిస్తే చాలా ప్రమాదకరం.

Published By: HashtagU Telugu Desk
New Project 3 10

New Project 3 10

Scorpion venom: ప్రపంచంలో విషపూరితమైన జీవులలో తేలు కూడా ఒకటి. తేలు కుడితే మనుషులు అసలు తట్టుకోలేరు. భరించలేనంతగా నొప్పి ఉంటుంది. తేలు విషం శరీరం మొత్తానికి ప్రవేశిస్తే చాలా ప్రమాదకరం. తేలి కుట్టిన వెంటనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే తేలును చూస్తేనే చాలామంది భయపడుతారు. తేలును చూస్తే వెంటనే చంపేస్తారు.

కానీ ప్రమాదకమైన తేలు విషానికి మాత్రం చాలా డిమాండ్ ఉంది. అవును. మీరు విన్నది నిజమే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిక్విడ్‌గా తేలు విషం నిలిచింది. లీటర్ తేలు విషం ధర రూ.100 కోట్లకు పైగా పలుకుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది తేళ్లను పెంచుతున్నారు. అయితే మాములు తేళ్ల విషం అంత పలకదు. ప్రమాదకరమైన డెత‌స్టాకర్ అనే తేలు విషానికి బాగా డిమాండ్ ఉంది. ఈ తేలు విషంలో మంచి గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

క్యాన్సర్ కణితులను గుర్తించడంతో పాటు మలేరియా చికిత్స కోసం ఈ తేలు విషం ఉపయోగపడుతుందట. డయాబెటిస్ నివారణ, మెదడు కణతుల చికిత్సలో కూడా ఈ జాతి తేలు విషం వాడతారు. ఆ తేలు విషంలో ఉండే క్లోరోటాక్సిన్ అనే పదార్థాన్ని కొన్ని రకాల క్యాన్సర్ చికత్సలకు ఉపయోగిస్తారు. దీంతో ఈ జాతి రకం తేళ్ల విషానికి ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంది. ఈ జాతి రకం తేళ్లు ఎక్కుగా ఆఫ్రికానుంచి మిడిల్ ఈస్ట్ లో ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే సహారా, అరేబియాన్, సెంట్రల్ ఏసియా, థార్ ఎడాలిలో ఉంటాయి. ఈ తేలు విషం చిక్కు ధర 130 డాలర్లు పలుకుతుండగా.. 4 లీటర్ల విషం ధర రూ.320 కోట్లుగా ఉంది. ఒక తేలు రెండు మిల్లీమీటర్ల విషం మాత్రమే ఇస్తుందని, ఒక లీటర్ కావాలంటే 10 లక్షల తేళ్లు కావాలని చెబుతున్నారు.

  Last Updated: 12 Apr 2023, 10:36 PM IST