Nara Lokesh :ఏవీ దొరక్కపోతే..గుడిని..గుడిలోని లింగాన్ని దోచుకుంటారు..!!

ఏపీ సీఎం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే...వైసీపీ నేతలు ఊర్లమీద పడి దోచుకుంటున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఏమి దొరక్కపోతే...గుడిని...గుడిలోని లింగము దోచుకుంటారని మండిపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh2

Nara Lokesh2

ఏపీ సీఎం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే…వైసీపీ నేతలు ఊర్లమీద పడి దోచుకుంటున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఏమి దొరక్కపోతే…గుడిని…గుడిలోని లింగము దోచుకుంటారని మండిపడ్డారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి వైసీపీ ముఠాలే హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ..టీడీపీ పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కొల్లగొట్టిన విగ్రహాల్లో ఒకటి వైసీపీ నేత ఇంట్లో మరకత వినాయకుడి రూపంలో బయటపడిందన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన చోటా వైసీపీ నేత వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో రూ. 25కోట్లు విలువ చేసే మరకత విగ్రహం బయటపడిందంటే…వైసీపీ బడానేతల ఇళ్లల్లో ఇంకేన్ని పురాతన విగ్రహాలు ఉన్నాయో అంటూ విమర్శించారు.

ఇదొక్కటే కాదు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ వైసీపీ నేతలు నగలు, విగ్రహాలు దోచుకుంటున్నారన్న అనుమానాలు భక్తుల్లో ఉన్నాయన్నారు. అంతర్వేది రథం దగ్దం, దుర్గమ్మ వెండి సింహాల మాయం, రామతీర్థం రాముడి తల నరికివేత ఘటనల్లో ఇప్పటికీ నిందితులు దొరకలేదన్నారు లోకేశ్. వెంకటేశ్వరరెడ్డి లాంటి వైసీపీ నేతల దగ్గర విగ్రహాలు దొరుకుతున్నాయని…ఈ దొంగ ప్రభుత్వం, దోపిడి పాలకుల హయాంలో ప్రజలకే కాదు…దేవాలయాల ఆస్తులకు దేవతా విగ్రహాకు రక్షణ లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని దేవాలయాలు అన్నింట్లో వీలైనంత తొందరగా కేంద్ర బ్రుందంతోకానీ…న్యాయబ్రుందం పర్యవేక్షణలో ఆడిట్ జరపాలన్నారు. లేదంటే దేవుళ్ల నగలు, విగ్రహాలు వైసీపీ నేతలు పిల్లలు మెడల్లో బంగారు ఆభరణాలుగా మారే ప్రమాదం ఉందన్నారు లోకేశ్.

  Last Updated: 14 Jun 2022, 08:26 AM IST