Munugode Voters: మీరిచ్చే డబ్బులొద్దు.. మా గూడేనికి రోడ్డు వేయండి!

మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఓటర్లు, ప్రజాప్రతినిధుల పార్టీల వెదజల్లే డబ్బులకు ఆశపడితే,

  • Written By:
  • Publish Date - October 12, 2022 / 02:25 PM IST

మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఓటర్లు, ప్రజాప్రతినిధుల పార్టీల వెదజల్లే డబ్బులకు ఆశపడితే, మరికొందరు ఉప ఎన్నిక మంచి ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఉప ఎన్నికలో ఓటు కోసం మా ఊరికి వచ్చే రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి. ఓటు కోసం మీరిచ్చే డబ్బులొద్దు.. మా గూడేనికి రోడ్డు వేయండి’ అని కోరుతున్నారు ఆ గ్రామస్థులు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి పంచాయతీ పరిధిలోని కాషవారిగూడెం గ్రామస్థులు తమ ఊరికి వెళ్లే మూడురోడ్ల కూడలిలో ఇలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.