Site icon HashtagU Telugu

Vizianagaram : విజ‌య‌న‌గ‌రంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో త‌ల్లికొడుకు మృతి

Suicide

Deadbody Imresizer

విజయనగరంలో విషాదం చోటుచేసుకుంది. పొలం ప‌నుల‌కు వెళ్లిన త‌ల్లికొడుకులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని వేపాడ మండలం వావిలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు తమ పొలానికి నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లారు. అక్కడ విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల రైతులు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాలను చూసి బోరున విలపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లీ కొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.