KGF Meme: KGF-2పై హైదరాబాద్ పోలీస్ సూపర్ మీమ్…!!

కేజీఎఫ్ -1 పాన్ ఇండియా మూవీగా రిలీజై భారీ విజయాన్ని సాంధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండో భాగంగా వస్తోన్న కేజీఎఫ్ -2 ఏప్రిల్ 14న జనం ముందుకు రానుంది.

  • Written By:
  • Updated On - April 9, 2022 / 01:36 PM IST

కేజీఎఫ్ -1 పాన్ ఇండియా మూవీగా రిలీజై భారీ విజయాన్ని సాంధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండో భాగంగా వస్తోన్న కేజీఎఫ్ -2 ఏప్రిల్ 14న జనం ముందుకు రానుంది. కేజీఎఫ్ -2 కు ఉన్న క్రేజ్ తో ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రశాంత నీల్ డైరెక్షన్ లో నిర్మితమైన ఈ మూవీ అందర్నీ అలరించింది. అదే జోరును రెండో భాగం కూడా మురిపించనుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స ఫార్మాట్ లో రిలీజ్ అవుతున్న తొలి కన్నడ చిత్రంగా కేజీఎఫ్ -2 నిలవనుంది. అయితే ఈ మూవీ క్రేజ్ ను హైదరాబాద్ సిటీ పోలీస్ లు ఉపయోగించుకుంటున్నారు.

టూవీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండం తప్పనిసరి. సురక్షితంగా మీ గమ్యస్థానాన్ని చేరుకోండి. ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించండి…ఇతరులకు ఆదర్శంగా నిలవండి అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. దానిపై హెల్మెట్ హెల్మెట్ హెల్మ్…ఐ డోంట్ లైక్ హెల్మెట్…బట్ హెల్మెట్ సేవ్స్ మీ…ఐ డోంట్ అవాయిడ్ హెల్మెట్ అని రాసి ఉంది.

అయితే కేజీఎఫ్ 2 ట్రైలర్ లో వయోలెన్స్…వయోలెన్స్…వయోలెన్స్…ఐ డోంట్ లైక్ ఇట్…ఐ అవాయిడ్, బట్ వయోలెన్స్ లైక్స్ మీ అంటూ చెప్పే డైలాగ్…హెల్మెట్ మీ హెల్మెట్ ను దూరంగా ఉంచుతుంది..అంటూ రోడ్డు భద్రతకు సంబంధించిన సలహా ఇచ్చారు. ఈపోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.