EPF Account: మీ పీఎఫ్ అకౌంట్ కు నామినీని -ఇలా యాడ్ చేసుకోండి…!!

పీ.ఎఫ్. అకౌంట్ అనేది ఉద్యోగుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైంది. సభ్యులు తమ కుటుంబ సంక్షేమం కోసం ఈ-నామినేషన్ యాడ్ చేసుకోవడం మంచిది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ , బీమా వంటి ప్రయోజనాలను EPFO తమ సభ్యులకు అందిస్తుంది.

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 08:21 PM IST

పీ.ఎఫ్. అకౌంట్ అనేది ఉద్యోగుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైంది. సభ్యులు తమ కుటుంబ సంక్షేమం కోసం ఈ-నామినేషన్ యాడ్ చేసుకోవడం మంచిది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ , బీమా వంటి ప్రయోజనాలను EPFO తమ సభ్యులకు అందిస్తుంది. PFపొందుతున్న ఉద్యోగి మరణించిన తర్వాత సంస్థ ఇచ్చే సామాజిక భద్రతా ప్రయోజనాలను సులభంగా కుటుంబ సభ్యులకు అందాలంటే నామినీని నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ నామినీ పేరు నమోదు చేసుకోవడం ఇప్పుడు చాలా సులభంగా మారింది. ఇంతకుముందు నామినేషన్ దాఖలు చేయడం కోసం EPFOకార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఆన్ లైన్ ద్వారా మీ ఆ నామినేషన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు.

E-నామినేసన్ను దాఖలు చేసేందుకు ఉద్యోగులు తమ UANనెంబర్ను…EPFపోర్టల్లో యాక్టివేట్ చేసుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్ వర్డ్ ఎంటర్ చేయగానే లాగిన్ అవుతారు. అందులో ప్రొఫైల్ పై క్లిక్ చేస్తే…ఈ నామినేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు నామినీ పేరు, వారితో ఉన్న సంబంధం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా నియమించుకోవచ్చు. అయితే నామినీ కూడా KYCని పూర్తి చేయాలి. కుటుంబ సభ్యులు లేని వారు వారికి కావాల్సిన వారిని నామినీలుగా ఎంచుకునే ఛాన్స్ ఉంది.

ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి. అక్కడ సర్వీసెస్ ఆప్షన్ లో ఫర్ ఎంప్లాయిస్ సెక్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ కింది భాగంలో ఎడమ వైపున ఉన్న సర్వీసెస్ ఆప్షన్ కింద కనిపిస్తున్న మెంబర్ యూఏఎన్ లేదా ఆన్ లైన్ సర్వీస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ యూఎఎన్ నెంబర్ పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న మ్యానేజ్ ట్యాప్ పై క్లిక్ చేసి…ఈ నామినేషన్ ను ఆప్షన్పై క్లిక్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు ఎంటర్ చేసి..ఎవరి వాట ఎంత ఇవ్వాలో కూడా అక్కడే తెలపాలి. ఒకసారి వివరాలన్నింటిని చెక్ చేసుకుని సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ పై క్లిక్ చేయాలి.

తర్వాత పేజ్ కు వెళ్లి ఇన్ సైన్ పై క్లిక్ చేస్తే వన్ టైం పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది. ఆధార్ కార్డు లింక్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. OTPఎంటర్ చేసిన తర్వాత ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది.