World Record: ఒకే తేదీన కుటుంబానికి చెందిన 9 మంది పుట్టిన రోజు.. అరుదైన గిన్నిస్ రికార్డ్?

పుట్టినరోజు మామూలుగా ఏడాదికి ఒక్కసారి వస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే బర్తడేను జరుపుకోవడం కోసం చాలామం

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 06:20 PM IST

పుట్టినరోజు మామూలుగా ఏడాదికి ఒక్కసారి వస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే బర్తడేను జరుపుకోవడం కోసం చాలామంది అనేక రకాల కలలు కంటూ ప్లాన్ లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకే రోజున చాలామంది పుట్టినరోజులు ఉండడం అన్నది సహజం. ప్రపంచవ్యాప్తంగానే తీసుకుంటే పుట్టినరోజు లక్షలమంది పుట్టినరోజులు ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్ని కొన్ని సార్లు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు సంబంధించిన పుట్టినరోజులు ఒకేసారి జరుపుకుంటూ ఉంటారు.

ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని చెప్పవచ్చు. కానీ పాకిస్థాన్ లో మాత్రం ఏకంగా ఒక కుటుంబం పుట్టినరోజు వేడుకలతో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. పుట్టినరోజు వేడుకలతో గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లోని కే కుటుంబానికి చెందిన 9 మంది పుట్టిన రోజు ఒకే తేదీన కావడంతో ఆ ఘనత వారికి దక్కింది. సింధ్‌ ప్రావిన్సులోని లర్కానా నగరానికి చెందిన అమీర్‌ అలి, ఖదీజా దంపతులకు 1992 ఆగస్టు 1న మొదటిపాప పుట్టింది. తర్వాత వరుసగా ఆరుగురు సంతానం అదే తేదీన పుట్టడం విశేషం.

ఇలా ఏడుగురు తోబుట్టువుల పుట్టినరోజు ఒకే తేదీన రాగా అమీర్‌, ఖదీజా దంపతుల పుట్టినరోజు, పెళ్లిరోజు సైతం అదే తేదీన కావడంతో ఆగస్టు 1 వచ్చిందంటే ఆ ఇంట్లో సంబరాలే అని చెప్పవచ్చు. నిజంగా ఇలా జరగడం చాలా అరుదు అని చెప్పవచ్చు. ఇలా ఈ పాకిస్థానీ కుటుంబం గిన్నిస్ గుర్తింపు సాధించింది. గతంలో అమెరికాకు చెందిన కమిన్స్‌ కుటుంబం పేరిట ఫిబ్రవరి 20న పుట్టిన అయిదుగురు పిల్లలతో ఈ గిన్నిస్‌ రికార్డు ఉండేది. ఇప్పుడు ఈ పాకిస్తానీ కుటుంబం ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా తొమ్మిది మంది పుట్టినరోజు ఒకే రోజున జరుపుకోవడం నిజంగా విశేషంగానే చెప్పవచ్చు..