Gold And Silver Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి ధరలు ఇవే..!

దేశంలో బంగారం, వెండి ధరలు (Gold And Silver Price Today) ఆదివారం పెరిగాయి. ఆదివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.52,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,380గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Gold- Silver Price

Gold- Silver Price

దేశంలో బంగారం, వెండి ధరలు (Gold And Silver Price Today) ఆదివారం పెరిగాయి. ఆదివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.52,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,380గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.72,700 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (ఫిబ్రవరి 12, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,530గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,250గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,380 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,430గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,380గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,380గా ఉంది.

Also Read: Womens T20 World Cup 2023: నేడే టీమిండియా తొలి సమరం.. చిరకాల ప్రత్యర్థి పాక్ తో పోరు..!

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,500 ఉండగా, ముంబైలో రూ.70,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కోల్‌కతాలో రూ.70,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కేరళలో రూ.72,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, విజయవాడలో రూ.72,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 12 Feb 2023, 08:03 AM IST