Delhi Fire news: ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం (Fire breaks) సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాస్‌ పార్ట్‌-1 ఏరియాలోని ఫియోనిక్స్ ఆస్పత్రి సెల్లార్‌లో శనివారం ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire breaks) ఐదు ఫైరింజన్‌లతో

  • Written By:
  • Publish Date - December 17, 2022 / 11:36 AM IST

ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం (Fire breaks) సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాస్‌ పార్ట్‌-1 ఏరియాలోని ఫియోనిక్స్ ఆస్పత్రి సెల్లార్‌లో శనివారం ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire breaks) ఐదు ఫైరింజన్‌లతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Also Read: Delhi : ఢిల్లీ ఫ‌తేపూర్ బేరీలో అగ్నిప్ర‌మాదం..ఐదుగురికి గాయాలు

శనివారం ఉదయం 9.08 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు కాల్‌పై సమాచారం అందిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అనంతరం ఐదు వాహనాలను అక్కడికక్కడే పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆ శాఖ తెలిపింది. ఆసుపత్రిలోని కార్యాలయం, అండర్‌గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయని, ఉదయం 9.50 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఆధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నామన్నారు.